telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

భూములు ఆక్రమించిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు: సుభాష్‌ చంద్రబోస్‌

pilli subhash chandra bose ycp

గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సర్కారు భూములు ఆక్రమణలకు గురయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కడప జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులకు సంబంధించి గురువారం కలెక్టరేట్‌లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలలు ఇవ్వాలన్న సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు.

ప్రతి పేదవాడికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పారు. జిల్లాలో దాదాపు 1.20 లక్షల మంది ఇళ్ల స్థలాలకి అర్హులుగా అధికారులు గుర్తించారని తెలిపారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి కుల, మత భేదాలు చూడకుండా ప్రతీ ఒక్క పేద కుటంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేయాలని చెప్పిన గొప్ప నాయకుడు జగన్ అని ప్రశంసించారు.

Related posts