telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

చెఱుకు రైతుల సమస్య పై ఎంసీహెచ్ఆర్డీలో సుదీర్ఘ సమీక్ష…

ట్రైడెంట్ షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం జహీరాబాద్ చెఱుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఈ నెల 18 వ‌తేదీలోగా చెల్లించాలి. నిర్ణీత గడువు లోపు చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కంపెనీపై చర్యలు తీసుకుంటాం. పారిశ్రామిక వేత్తలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అవసరమైన వాతావరణం కల్పించింది. ఇలాంటి తరుణంలో రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు గురి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. జహీరాబాద్ పరిధిలో గల 9 వేల మంది చెఱుకు రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీ పడదు. ఇప్పటికే చెఱుకు రైతులు‌ ట్రైడెంట్ యాజమాన్యం పై విశ్వాసం కోల్పోయారని, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఫ్యాక్టరీ యాజమాన్యానిదే అని ప్రతినిధులకు వివరించడం జరిగింది. అందుకు షుగర్ ఫ్యాక్టరీ ప్రతినిధులు ఈ నెల 11న ఐదు‌ కోట్లు, 18వ తేదీన మిగతా ఎనిమిది కోట్లు చెల్లిస్తామని హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది చెఱుకు కొనుగోలు ఒప్పందాలు రైతులతో పారదర్శకంగా చేసుకోవాలి. జిల్లాలోని ఇతర షుగర్ ఫ్యాక్టరీలు చెల్లిస్తున్న రీతిలో రైతులకు అదే ధర చెల్లించాలి. రైతుల సమక్షంలో నే సుగర్స్ ఫ్యాక్టరీ నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించడం జరిగింది.

Related posts