telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

గిన్నీస్‌ రికార్డు కోసం .. 53కిమీ వెనుకకు పరుగు..

reverse running for Guinness record

గుజరాత్‌కు చెందిన ఇద్దరు మహిళలు గిన్నీస్‌ రికార్డు కోసం వినూత్న యత్నం చేశారు. 13 గంటల వ్యవధిలో దాదాపు 53 కిలోమీటర్ల మేర వెనకకు (రివర్స్‌ రన్నింగ్‌) పరుగెత్తారు. ట్వింకిల్‌ థాకర్‌, స్వాతి థాకర్‌ అనే ఆ ఇద్దరు మహిళలు మీడియాతో మాట్లాడుతూ, మహిళా సాధికారతపై ప్రధాని మోడీ ఇచ్చిన సందేశం తాము ఈ ప్రయత్నం చేయడానికి ప్రేరణ కలిగించిందన్నారు. ప్రతి మహిళకూ ఒక్కో అంశంలో ప్రత్యేక అంశంలో నైపుణ్యం ఉంటుందని, అటువంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని బర్దౌలి ప్రాంతం నుంచి మంగళవారం ఈ ఇద్దరు మహిళలు వెనక పరుగు ప్రారంభించారు. 53 కిలోమీటర్ల ప్రయాణం సాగించి తరువాతి రోజు బుధవారం దండి ప్రాంతానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను వారు గిన్నీస్‌ బుక్‌ రికార్డ్స్‌ సంస్థకు పంపించారు. ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్న నమ్మకం తొలుత మాలో లేదు. ఈ సమయంలో మా కుటుంబసభ్యులు ఎంతగానో ప్రోత్సహించారని ట్వింకిల్‌ థాకర్‌ పేర్కొన్నారు.

Related posts