telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో” అవకాశం చేజార్చుకున్న కాజల్

Kajal

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌నుంది. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాపై అంచనాలను పెంచడం కోసం మేకింగ్ పరంగా యూనిట్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అందులో భాగంగా ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించింది. ఈ సాంగ్‌‌లో బాలీవుడ్ బ్యూటీ  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రభాస్‌ కలిసి కాలు కదిపింది. బ్యాడ్ బోయ్ అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసి 20 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుంది. అయితే ముందుగా కాజ‌ల్‌ని స్పెష‌ల్ సాంగ్ కోసం సంప్ర‌దించార‌ట‌. ఆమె రెండు కోట్ల రెమ్యున‌రేష‌న్ డిమాండ్‌ చేయ‌డంతో చిత్ర బృందం కాజ‌ల్ స్థానంలో జాక్వెలిన్‌ని తీసుకున్నట్టు స‌మాచారం. కాజ‌ల్ “జ‌న‌తా గ్యారేజ్” చిత్రంలో ఎన్టీఆర్‌తో స్పెష‌ల్ సాంగ్ చేసిన విష‌యం తెలిసిందే. కాజ‌ల్ న‌టించిన కోమ‌లి, రణ‌రంగం చిత్రాలు ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు రాగా, వీటికి మంచి ప్ర‌జాద‌ర‌ణ ల‌భించింది. మరోవైపు కమల్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “భారతీయుడు-2″లో నటిస్తోంది. మరోవైపు శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సూర్యతో జ‌త‌క‌ట్ట‌నుంది కాజ‌ల్‌.

Related posts