telugu navyamedia
news political Telangana

కేసీఆర్ సభకు వెళ్తా..రేవంత్ సతీమణి గీత!

revanthreddy wife to kcr meeting
కొడంగల్‌‌లో 144 సెక్షన్ ఉన్న సమయంలో  కేసీఆర్ సభకు ఎలా అనుమతి ఇస్తారని  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భార్య గీత పోలీసులను ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన పోలీసులు ఆ సభకు అన్ని రకాల అనుమతులూ ఉన్నాయని చెప్పారు. కొడంగల్‌లో కేసీఆర్ సభకు  అనుమతి ఉంటే  నాకు  కూడ  అనుమతి ఇవ్వాలని  గీత ప్రశ్నించారు. దీంతో తాను కూడా కేసీఆర్ సభకు వెళతానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం  మీటింగ్ కు వెళ్తాను తనకు అనుమతి ఇవ్వాలని ఆమె పోలీసులను కోరారు.
తమ అటెన్షన్ ను డైవర్ట్ చేసి దొడ్డిదారిన టీఆర్ఎస్‌ నేతలు ఎన్నికలను తమకు అనుకూలంగా చేసుకొనే ప్రయత్నం చేస్తోందన్నారు. గ్రామాల్లోకి డబ్బులను పంపి  టీఆర్ఎస్ నేతలు  అక్రమంగా డబ్బులు వెదజల్లేందుకు ప్రయత్నాలు చేసే ప్రమాదం ఉందన్నారు. రేవంత్ రెడ్డిని ఓడించేందుకు భారీ కుట్ర జరుగుతోందని గీత ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా  అప్రమత్తంగా ఉండాలన్నారు. 

Related posts

పదో తరగతి విద్యార్థినిపై బ్లేడుతో దాడి!

vimala p

ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం

vimala p

జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో ముందడుగు: కేసీఆర్

ashok