telugu navyamedia
political Telangana

పది రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది: రేవంత్

Revanth Reddy challenge on Kondangal election
పది రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కొడంగల్‌ నియోజకవర్గం బోమరాస్‌పేట్‌లో నిర్వహించిన ఎన్నికల రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎవరూ బ్యాంకులకు రుణాలు చెల్లించొద్దని సూచించారు. తాకట్టులో ఉన్న పాసు పుస్తకాలన్నీ రైతుల ఇళ్లకు తానే తీసుకొచ్చి ఇస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు కేసీఆర్‌ అన్యాయం చేశారని విమర్శించారు. కేసీఆర్‌ ఒక్క ఉద్యోగం ఊడగొడితే ..100 రోజుల్లో లక్ష ఉద్యోగాలిచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. 
తనను ఓడించాలని తెరాస నేతలు అంటున్నారని,  అభివృద్ధి చేసినందుకు నన్ను ఓడించాలా? అని ప్రశ్నించారు. వికారాబాద్‌ జిల్లాకు తెరాస ప్రభుత్వం ఎందుకు డబుల్‌ రోడ్డు ఇవ్వలేదని ప్రశ్నించారు. బోమరాస్‌పేట పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా చేయాలని కోరితే ఎందుకు చేయలేదని నిలదీశారు. తొమ్మిదేళ్ల క్రితం కొడంగల్‌ ప్రజలు నాటిన మొక్కను తానని అన్నారు. ఇక్కడి ప్రజల ఆశీర్వాదం వల్లే ఈ నియోజకవర్గం అందరికీ తెలిసిందన్నారు. గల్లీలో ఉన్న రేవంత్‌రెడ్డిని దిల్లీలో ఉన్న రాహుల్‌ గాంధీ గుర్తించారని చెప్పారు. ఈ 48 గంటలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రేవంత్‌ సూచించారు. ఊర్లోకి కొత్తవాళ్లెవరైనా వస్తే పట్టుకోండని పిలుపునిచ్చారు.

Related posts

కోస్తా తీరంలో పెథాయ్ బీభత్సము… భారీ వర్షాలు

ashok

ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా: హరీశ్ రావు

vimala p

సుదర్శన యాగంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: హరీష్ రావు

vimala p