telugu navyamedia
news political Telangana

వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రాజీనామా

Congress Revanth Comments TRS

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పగ్గాలు మీ చేతుల్లోనే ఉండాలంటూ సీనియర్ నేతలు సహా ఎవరు చెప్పినా రాహుల్ వినిపించుకోవడంలేదు. అంతేకాదు, పార్టీ పరాజయానికి పదవుల్లో వున్న పెద్దలంతా సమష్టి బాధ్యత తీసుకోవాలంటూ ఆయన వ్యాఖ్యానించడం సంచలనమైంది. దీంతో సీనియర్ నేతలు దేశవ్యాప్తంగా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడిచారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాహుల్ గాంధీ నిర్ణయం స్ఫూర్తిగానే తాను పదవి నుంచి వైదొలగినట్టు రేవంత్ స్పష్టం చేశారు. పదవిలో లేకపోయినా పార్టీని పటిష్టపరిచేందుకు తనవంతు సహకారం అందిస్తామని వివరించారు.

Related posts

హైదరాబాద్‌ : … రవిప్రకాష్ కు .. బెయిల్ మంజూరు..

vimala p

చంద్రబాబు ఇంకా తానే సీఎం అనే అపోహలో ఉన్నారు: హోం మంత్రి సుచరిత

vimala p

టేకాఫ్‌కు రెడీగా ఫ్లైట్… ఇంతలో పైలెట్ల అరెస్ట్

vimala p