telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

Revanth-Reddy mp

తన నివాసం నుంచి వెలుపలికి వచ్చేందుకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తాను ఓ ప్రెస్ మీట్ కు వెళ్లాల్సి ఉందని తెలిపారు. అయితే పోలీసులు అందుకు అనుమతించలేదు. గాంధీ ఆసుపత్రి వద్ద డాక్టర్ల ధర్నా జరుగుతోందని, కనీసం అక్కడికి వెళ్లి డాక్టర్లను పలకరించి వస్తానని అన్నారు. పోలీసులు అందుకు కూడా ఒప్పుకోకపోవడంతో, ప్రజలు తనకు ఓట్లేసి గెలిపించారని, ప్రజా సమస్యలపై తాను ఇక్కడే ఉండి ఎలా స్పందించగలనంటూ రేవంత్ బదులిచ్చారు.

నీ డ్యూటీ నువ్వు చేసినట్టే నా డ్యూటీ నేను చేయాలి కదా?’ అంటూ రేవంత్ రెడ్డి సామరస్య పూర్వకంగా పోలీసులకు సర్ది చెప్పారు. నేను బయటికి వెళితే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముంటుంది, ప్రెస్ మీట్ కు వెళ్లాలి, అక్కడ్నించి గాంధీ ఆసుపత్రికి వెళ్లాలి. అట్నుంచెటైనా వెళతాను, లేకపోతే ఇట్నుంచి అటైనా వెళతాను అని చెప్పారు. కావాలంటే మీ వాహనంలోనే వస్తాను. మీ పై అధికారికి ఫోన్ చేసి అడగండని రేవంత్ రెడ్డి పోలీసులను కోరారు.

Related posts