telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విద్యుత్‌ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయాయి: రేవంత్‌రెడ్డి

Revanth-Reddy mp

తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయని కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ లేఖ రాశారు. ఈఆర్సీ చైర్మన్‌, సభ్యులను నియమించాలని లేఖలో డిమాండ్ చేశారు. ఐదున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో సంస్థలన్నీ స్వతంత్రతను కోల్పోయాయని పేర్కొన్నారు.

ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా కోల్పోయిందని ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థ ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదన్నారు. విద్యుత్‌ కొనుగోళ్లు, ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటులో అవినీతి, అక్రమాలపై ఆధారాలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈఆర్సీ అనుమతి లేకుండా విద్యుత్‌ రంగంలో తీసుకునే ఏ నిర్ణయమైనా చట్టవిరుద్ధమేనని రేవంత్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Related posts