telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైకోర్టులో రేవంత్‌ కు చుక్కెదురు

Congress Revanth Comments TRS

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. రేవంత్‌ అరెస్ట్‌ పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టు తుది తీర్పును ప్రకటించింది. రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అరెస్ట్‌ అక్రమమనడానికి తగిన కారణాలు చూపలేదని హైకోర్టు పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కొడంగల్‌లో సీఎం కేసీఆర్ సభకు ఒకరోజు ముందు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌కు కేసీఆర్‌ను రానివ్వబోమంటూ హెచ్చరించారు. దీంతో ఆ అర్ధరాత్రి అనూహ్యంగా రేవంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ వేం నరేందర్ రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నికల సంఘాన్ని వివరణ కోరుతూ కోర్టు ఆదేశాలు జారీచేసింది.

Related posts