telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ విద్యా వార్తలు

రీ వాల్యుయేషన్ లో … మార్కులు పెరిగితే .. 600 వాపసు.. : ఇంటర్ బోర్డు

telangana intermediate board

తెలంగాణ ఇంటర్ బోర్డు, ఇప్పటికే ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను మరోసారి మూల్యాంకనం చేయనున్నట్టు ప్రకటించి, రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకున్న వారికి మార్కులు పెరిగితే, రుసుమును వెనక్కు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఒక్కో జవాబు పత్రానికి రీ వాల్యుయేషన్, వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థుల మార్కులు పెరిగితే, ఫీజుగా తీసుకునే రూ. 600 వెనక్కు ఇచ్చేస్తామని విద్యా శాఖ కార్యదర్శి బీ జనార్దన్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం తాము రాసిన ఆరు పేపర్ల పునఃపరిశీలనకు విద్యార్థులు రూ. 3 వేలు చెల్లిస్తున్నారు. ఒకవేళ మార్కులు పెరిగినా, ఇప్పటివరకూ చెల్లించిన డబ్బును వెనక్కు ఇచ్చే పరిస్థితి లేదు. మార్కులు పెరిగితే, తొలిసారిగా దాన్ని దిద్దిన అధ్యాపకుడు చేసిన తప్పు తీవ్రతను బట్టి రూ. 2 వేల నుంచి రూ. 20 వేల వరకూ జరిమానా విధిస్తున్నారు. ప్రతి సంవత్సరమూ రీ వాల్యుయేషన్ కు 18 నుంచి 20 వేల వరకూ దరఖాస్తులు వస్తుండగా, ఈ సంవత్సరం ఇప్పటికే 75 వేలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం.

Related posts