telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

లేటు వయసులో .. లేత పిల్ల కోసం తిప్పలు.. 46 లక్షలు స్వాహా..

Hyderabad Wisdom Jobs Portal Cheat youth

మానసిక ఒత్తిడి కారణం కాబోలు, ఎప్పుడు ఏమి చేస్తున్నామో తెలియని స్థితిలో కొందరు తిప్పలు తెచ్చుకుంటున్నారు. అవి కూడా మాములుగా కాదు.. ఒక్క దెబ్బతో బిచ్చగాళ్ళైపోతున్నారు. తాజాగా, ఉద్యోగం నుంచి రిటైర్ అయిన 65 ఏళ్ల వృద్ధుడు, లేటు వయసులో ఎవరితోనైనా డేటింగ్ చేయాలని భావిస్తే, అతని కోరికను అలుసుగా తీసుకున్న డేటింగ్ వెబ్ సైట్, ఓ అమ్మాయిని రంగంలోకి దించగా, మాయమాటలు చెబుతూ, రూ. 46 లక్షలు లాగేసిన ఘటన ఇది. తనకు వచ్చిన పదవీ విరమణ సొమ్మంతా ఇలా పోగొట్టుకున్నానని ఇప్పుడు వాపోతున్నాడు.

న్యూఢిల్లీకి చెందిన వృద్ధుడు, ఓ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోగా, తొలుత మీరా అనే యువతి నుంచి ఫోన్ వచ్చింది. ప్రీమియం మెంబర్ గా రిజిస్టర్ కావాలని కోరితే, ఆ పని చేశాడు. ఆపై ముగ్గురు మహిళల ఫొటోలను పంపగా, ఒకరిని ఎంచుకున్నాడు. ఆమెతో ఏడాది డేటింగ్ చేసేందుకు రూ. 10 లక్షలు కట్టాలని చెబితే, ఆశతో ఆ డబ్బు కట్టాడు. ఆపై తాను ఎంపిక చేసుకున్న మహిళ రోజీ అగర్వాల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆమె కూడా సాకులు చెబుతూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. అడిగినప్పుడల్లా డబ్బు పంపుతున్నా, ఆమె డేటింగ్ కు రాలేదు.

software engineer  Cheating Girl protestఅతగాడు రిజిస్టర్ చేసుకున్న వెబ్ సైట్ ను పరిశీలించగా, అది ఓ మోసపూరిత వెబ్ సైట్ అని రివ్యూలు చూసి, తాను మోసపోయానని గ్రహించాడు. పరువు పోతుందని భావించిన ఆయన కొన్ని నెలల పాటు మౌనంగా ఉండి, చివరకు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన మోసంపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.

Related posts