telugu navyamedia
news political

జమ్మూలో తెరచుకున్న పాఠశాలలు.. కశ్మీర్‌లో ఆంక్షలు!

18 soldier died in jammu kashmir bomb blast

జమ్మూలో ఆంక్షలు ఎత్తివేశామని జమ్మూకశ్మీర్‌ అడిషనల్‌ డీజీపీ మునీర్‌ ఖాన్‌ పేర్కొన్నారు. కశ్మీర్‌లో మాత్రం కొన్ని రోజుల పాటు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఆంక్షలు ఎత్తివేయడంతో జమ్మూలో పాఠశాలలు, ఇతర సంస్థలు, వాణిజ్య సముదాయాలు తెరుచుకున్నాయని తెలిపారు. కశ్మీర్‌లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తాము పంద్రాగస్టు వేడుకలపై దృష్టి నిర్వహించామని తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ వేడుకలను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. శాంతియుతంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.  గతంలో వైరల్‌ అయిన వీడియోలను ఇప్పుడు మళ్లీ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Related posts

చిరంజీవి బ్లడ్ బ్యాంకు కు .. అరుదైన గౌరవం..

vimala p

రామోజీరావుతో చంద్రబాబు భేటీ..

vimala p

చివరి వన్డేలో భారత్‌ ఘనవిజయం.. 4-1 తేడాతో సిరీస్‌ కైవసం

vimala p