telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నేటి నుంచే సిటీలో న్యూఇయర్ ఆంక్షలు…

lockdown hyderabad

ఈరోజుతో రాజాలను ఎంతో కష్టపెట్టిన 2020 ముగియనుంది. దాంతో ప్రజలు 2021 తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అంతా ఆశిస్తున్నారు.. అయితే, ప్రస్తుతం కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో.. న్యూఇయర్ వేడుకలు వద్దంటూ ఇప్పటికే సైబరాబాద్‌ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.. ఇదే సమయంలో.. రాత్రి 12 గంటల వరకు వైన్స్‌లకు.. రాత్రి ఒంటి గంట వరకు బార్లకు అనుమతి ఇచ్చేశారు అధికారులు.. ఇక, కొత్త సంవత్సర వేడుకల దృష్ట్యా హైదరాబాద్‌లో ఆంక్షలు విధించారు పోలీసులు.. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఈ ఆంక్షలు గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు అమలు చేయనున్నారు.. బేగంపేట్ ఫ్లై ఓవర్ మినహా.. జంట నగరాల్లో అన్ని ఫ్లైఓవర్లు మూసివేయన్నారు పోలీసులు. సైబర్‌ టవర్స్‌, గచ్చిబౌలి, బయోడైవరిర్సటీ ఫ్లేఓవర్లు, జేఎన్‌టీయూ, మైండ్‌స్పేస్‌, దుర్గం చెరువు తీగల వంతెనలను కూడా మూసివేయనున్నట్టు పోలీసులు ప్రకటించారు.. ఇక, ఔటర్ రింగ్‌ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కార్లు, జీపులను అనుమతించబోమని ప్రకటించారు అధికారులు.. అంతేకాకుండా సిటీలోని నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌, బీఆర్‌కే భవన్‌, తెలుగు తల్లి కూడలి, లిబర్టీ జంక్షన్‌, నల్లగుట్ట రైల్వే వంతెన వద్ద వాహనాలను దారి మళ్లించనున్నట్టు వెల్లడించారు. రూల్స్‌ ఎవరు బ్రేక్ చేసినా వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు.. అసలే జనవరి 1వ తేదీ నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్న నేపథ్యంలో.. పోలీసులకు దొరికితే కష్టాలు తప్పవు. కాబట్టి ప్రజలు అందరూ జాగ్రత్తగా వ్యవరించాలి. 

Related posts