telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అగ్రవర్ణాలకు.. రిజర్వేషన్లు.. కేంద్రం ఆమోదం..

Modi wishes to Imran Pakistan

ఎప్పటి నుండో అగ్రవర్ణాలలో ఉన్న పేదవారికి రిజర్వేషన్ లు కల్పించాలని డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. దానికి ప్రస్తుతం భారత ప్రభుత్వం స్పందించింది. అయితే దీనిని ఎన్నికల తాయిలం అనుకోవాలా.. లేక, నిజంగా ఎప్పటి నుండో డిమాండ్ ఉన్నది కాబట్టి ఇప్పటికి మోక్షం కలిగిందా.. అనేవి మాత్రం ప్రస్నార్ధకాలే. ఇక వివరాలలోకి వెళితే, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని నిర్ణయించింది.

ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీనికి సంబంధించిన రాజ్యంగ సవరణ బిల్లును రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు, అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లను కల్పించాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి.

ఈరోజు మధ్యాహ్నం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర లభించింది. దీనికి సబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును రేపు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు.

10 శాతం రిజర్వేషన్లకు కండిషన్లు ఇవే :
* సంవత్సర ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
* వ్యవసాయ భూమి 5 హెక్టార్ల కంటే తక్కువగా ఉండాలి.
* నివాసం 1,000 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉండలి.
* మున్సిపాలిటీయేతర ప్రాంతంలో అయితే నివాస భూమి 209 చదరపు గజాలకంటే తక్కువగా ఉండాలి.

Related posts