telugu navyamedia
news telugu cinema news trending

దోమలతో జాగర్తగా ఉండాలి .. : రేణుదేశాయ్ ..

renudesai with dengue photo viral

గత గొంతకాలంగా సోషల్ మీడియాలో ఎప్పుడు విమర్శలకు సరైన జవాబు ఇస్తుంటారు.. తాజాగా, డెంగీ జ్వరం రావడంతో హాస్పటల్ లో చేరి వైద్యం చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అంటూ ఆమె తన గురించిన న్యూస్ ను అందరికీ షేర్ చేసింది. దీనికి సంబంధించి ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఫోటోను షేర్ చేస్తూ మెసేజ్ కూడ పెట్టింది. ‘నా ముఖం చూశారుగా అందులో బాధ కనిపించడానికి కారణం డెంగీ. కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నాను. కోలుకుంటున్న సమయంలో ఢీ చాంపియన్స్ రియాలిటీ షోలో పాల్గొనాల్సి వచ్చింది. కొన్ని గంటలే షూటింగ్ కావడంతో కాదనలేక పోయాను.” అని అంటూ రేణు దేశాయ్ ఒక సెల్ఫీ పిక్ ను పోస్ట్ చేస్తూ తన బాధను వ్యక్త పరుచుకుంది.

దోమలతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. దోమల నుంచి కాపాడుకోవడానికి క్రీములు రాసుకోవడంతో పాటు, ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు ధరించండి. దోమకాటుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.. అని తన అభిమానులకు ఆరోగ్య సూత్రాలు జాగ్రత్తలు తెలియ చేస్తోంది. 2017లో స్టార్ మా టీవీలో ‘నీతోనే డాన్స్’ అనే కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన రేణు దేశాయ్ కి ఆతరువాత బుల్లితెర కార్యక్రమాలకు సంబంధించి అనేక ఆఫర్లు వచ్చినా వాటిని పట్టించుకోకుండా రైతుల సమస్యల పై ఒక సినిమా తీయాలని చాల ప్రయత్నాలు చేస్తోంది.

Related posts

క్షీణిస్తున్న పారికర్ ఆరోగ్యం..కబళిస్తున్న క్యాన్సర్.. !

vimala p

కృష్ణ జింకల కేసులో నేడు కోర్టుకు సల్మాన్

vimala p

చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి : ఉమ్మారెడ్డి

vimala p