telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ విషయం కొత్త తరానికి తెలియడానికే నా కూతురిని తీసుకొచ్చాను… రేణూ దేశాయ్

renu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు, తనకు ఛాలెంజ్ ఇచ్చిన ఉదయభానుకు రేణు దేశాయ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇప్పుడున్న జీవన విధానంలో మనందరం అపార్ట్‌మెంట్ కల్చర్‌కి అలవాటు పడ్డాం. మన చిన్నతనంలో సొంత ఇళ్లలో ఉండడం వల్ల ఆ చుట్టు పక్కల అప్పుడప్పుడు మన పెద్ద వాళ్ళు మొక్కలు నాటి పెంచుతూ ఉంటే మనం చూసి నేర్చుకున్నాం. కానీ, ఈ కొత్త తరానికి చెట్లను ఏ విధంగా నాటాలి, పెంచాలనే విషయం తెలియడం లేదు’’ అని రేణు అన్నారు. తన కూతురు ఆద్య, ఆమె స్నేహితురాలు యషిక ఇద్దరినీ ఇక్కడికి తీసుకురావడానికి కారణం.. వారికి మొక్కలను ఏ విధంగా నాటాలి, మొక్కలు నాటడం వల్ల ఉపయోగం ఏంటి అనే విషయాన్ని తెలపటం కోసమేనని రేణు వెల్లడించారు. ఇప్పుడు నాటే మొక్కలు తక్షణమే ఫలితం ఇవ్వకున్నా భవిష్యత్ తరాలకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. పిల్లలకు తమ చేతులతో మొక్కలు నాటడం నేర్పించాలని పిలుపునిచ్చారు. తాను ఈ ఛాలెంజ్‌కు మరో ముగ్గురిని నామినేట్ చేయడం లేదని.. ప్రజలందరికీ ఈ ఛాలెంజ్ ఇస్తున్నానని రేణు చెప్పారు.

Related posts