telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అకీరా టాలీవుడ్ ఎంట్రీ… రేణూ దేశాయ్ ఏమంటోందంటే ?

Akira

పవన్ కల్యాణ్ రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. దాంతో ఇప్పుడు ఆయన అభిమానులకు ఏదో తెలియని లోటు కనిపిస్తూనే ఉంది. మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు సినిమాలు చేసినా కూడా పవన్ కు ఉన్న క్రేజ్ వేరు. ఇక ఇప్పుడు ఈయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో తనయుడిని సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. పవన్ కొడుకు అకీరా నందన్ సినిమాల్లోకి రాబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే అకీరా మరాఠీలో ఓ సినిమా చేశాడు. రేణు దేశాయ్ తెరకెక్కించిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో అకీరా నటించాడు. దీన్ని తెలుగులో అనువదించాలని చూస్తున్నారు. రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలోనే అకీరా తొలి సినిమాను నిర్మిస్తాడని తెలుస్తుంది. సొంత నిర్మాణ సంస్థలోనే ఈయన సినిమా ఉండబోతుందనే ప్రచారం అయితే జరుగుతుంది. తాజాగా ఈ విషయంపై స్పందించింది రేణూ దేశాయ్. తప్పుడు వార్తలు రాసిన వెబ్ సైట్స్ ను నమ్మకండి. మా నుండి ఎటువంటి అప్డేట్స్ ఉన్న మా ఆఫీషీయల్ ఖాతాలలో మేము ఆ విషయాలని తెలియచేస్తాము అంటూ ఒక ఫేస్బుక్ పేజీ పెట్టిన పోస్టుకు స్పందించారు ఆవిడ. పిల్లలపై తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దు అంటూ విజ్ఞప్తి చేసారు. దీంతో అకిరా టాలీవుడ్ ఎంట్రీపై వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

Related posts