telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాబోయే భర్త పేరు చెప్పడానికి .. ససేమిరా అంటున్న .. : రేణూదేశాయ్

Renudeshai fire to Janasena team

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో లైవ్ లో మాట్లాడుతూ ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను అడగవద్దని క్లాస్ పీకారు. కాబోయే భర్త పేరు చెప్పాలని ఓ అభిమాని కోరగా, అతని పేరును తాను చెప్పలేనని, పెళ్లి అయిన తరువాత అతని వివరాలు తెలుస్తాయని అన్నారు. తాను ఈ లైవ్ వీడియోలో అతన్ని బలవంతంగా తెచ్చి కూర్చోబెట్టలేనని, అతనికి కూడా కొంత ప్రైవసీ ఉండాలని అన్నారు.

Renu desai ones again fire on social mediaతాను చేసుకోబోతున్న వ్యక్తి ఓ ఐటీ ప్రొఫెషనల్ అని అన్నారు. ఇక మరో ఫ్యాన్ ఇంకో అడుగు ముందుకేసి, కాబోయే భర్తను ఎప్పుడెప్పుడు కలుస్తారు? అని ప్రశ్నించగా, ఇలా అడగటం బ్యాడ్ మేనర్స్ అని హితవు పలికారు. ఇది మంచి సంస్కారం కాదని, వేరేవాళ్ల పర్సనల్ విషయాలు అడగకూడదని అన్నారు. ఇలా అడిగితే, తాను సమాధానాలు ఎలా చెప్పగలనని, ఏ సెలబ్రిటీలయినా, వారు కూడా మనుషులేనని గుర్తుంచుకోవాలని చెప్పారు.

Related posts