telugu navyamedia
సినిమా వార్తలు

అలీ షోలో రేణుదేశాయ్… పవన్ తో గొడవ నిజమే…

Renudeshai fire to Janasena team

ప్రముఖ టీవీ ఛానెల్ లో అలీ నిర్వహించే షో “అలీతో సరదాగా” అనే ప్రోగ్రామ్ కు పలువురు నటీనటులు, సెలెబ్రిటీలు కూడా వస్తూ ఉంటారు.ఈ షోలో పాల్గొన్న సెలెబ్రిలతో అలీ సరదాగా మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద అంశాలను కూడా నేరుగా వారి ముందు ఉంచుతారు. తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో రేణుదేశాయ్ ప్రోగ్రాం కు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా అలీ, రేణుదేశాయ్ మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో “రేణు” అనే పేరు మీకు ఇష్టం లేదంట కదా..? ఎందుకని అలీ ప్రశ్నించగా… ‘అవును.. నాకు నా పేరు అంటే నచ్చదు. రేవతి లేదా రేవ అని పెడితే బావుండేది’ అని చెప్పింది రేణు. అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే ఎడిటర్ మీరే అంట..? అనే ప్రశ్నకి స్పందించిన రేణు.. ‘నేను జానీ, ఖుషీ సినిమాలకు ఎడిటర్ గా చేశాను.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎస్.జె.సూర్య గారు, రత్నం గారు కళ్యాణ్ గారే అందుకు సాక్ష్యం” అంటూ చెప్పుకొచ్చింది. రేణు పుట్టినప్పుడు తన తండ్రి ఆడపిల్ల పుట్టిందని హాస్పిటల్ కి కూడా వెళ్లలేదట. ఈ విషయాన్ని అలీ గుర్తు చేయగానే ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ ప్రోమోలో రేణు తన రెండవ పెళ్ళి గురించి కూడా చెప్పుకొచ్చింది. ఇక ఈ షోలో రేణు రివర్స్ లో “మీకూ, పవన్ కు పెద్ద గొడవ అయ్యిందట కదా” అంటూ అలీకి ఓ ప్రశ్నను సంధించింది.

Related posts