telugu navyamedia
culture news telugu cinema news

డెంగీ జ్వరంతో రేణూ దేశాయ్..సోషల్ మీడియాలో ప్రకటన

Renu-Desai

ప్రముఖ హీరోయిన్, దర్శక-నిర్మాత రేణూ దేశాయ్ తమ అనారోగ్య విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రస్తుతం తాను డెంగీ జ్వరం బారిన పడి కోలుకుంటున్నానని తెలిపారు. డెంగీ నుంచి కోలుకుంటున్నప్పటికీ తాను ఓ షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చిందని వెల్లడించారు.

ఈ విషయమై రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందిస్తూ..‘ఈటీవీలో ప్రసారం కాబోయే ఢీ ఛాంపియన్ షో 12వ సీజన్ కోసం షూటింగ్ జరిగింది. కొన్నిగంటల పాటు జరిగిన షూటింగ్ కు నేను కాదని చెప్పలేకపోయా. దోమల నుంచి జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పొడవైన దుస్తులనే ధరించండి’ అని సూచించారు. ఈ సందర్భంగా డెంగీ వ్యాధితో షూటింగ్ లో పాల్గొన్న సమయంలో దిగిన ఓ ఫొటోను రేణూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Related posts

గట్టెక్కేసిన .. పౌరసత్వ సవరణ బిల్లు ..

vimala p

ప్రతిక్షణం ప్రజల సంక్షేమం: సీఎం జగన్

vimala p

మోడీ ప్రమాణస్వీకారానికి .. కాజల్ కు ఆహ్వానం..! రానంటూ ..

vimala p