telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

వీటితో.. వైరల్ ఫీవర్ కు చెక్..

remedies to overcome all types of fevers

సాధారణ జ్వరం మొదలుకొని, వైరల్ ఫీవర్ దాకా ఏది రావడానికైనా పెద్దగా కారణాలు అవసరం లేదు. అవి ఎలాగూ అంటువ్యాదులు కాబట్టి, సోకడం సులభం. అయితే వాటినుండి జాగర్తగా ఉండేందుకు కొన్ని చిట్కాలు తప్పనిసరి. వైర‌ల్ ఫీవ‌ర్ అనేది మ‌న‌కు ఏ సీజ‌న్‌లో అయినా, ఎప్పుడైనా రావ‌చ్చు. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వైర‌ల్ ఫీవ‌ర్‌తోపాటే త‌ల‌నొప్పి, ద‌గ్గు, జ‌లుబు, వికారం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దీంతో శ‌రీరంపై వైర‌స్‌ల దాడి ఎక్కువ‌గా ఉంటుంది. అలాంట‌ప్పుడు వైద్యుడి సూచ‌న మేర‌కు మందుల‌ను వాడాలి. దాంతోపాటు కింద సూచించిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే వైర‌ల్ ఫీవ‌ర్‌ను త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. ఆ చిట్కాలు… చూద్దాం.

* ఒక పాత్ర‌లో ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో కొద్దిగా ధ‌నియాల పొడి వేసి బాగా మ‌రిగించాలి. క‌షాయం త‌యార‌య్యాక గోరువెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి. దీంతో వైర‌ల్ ఫీవ‌ర్ నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

* తుల‌సి ఆకుల్లో జ‌ర్మిసైడ‌ల్‌, యాంటీ బ‌యోటిక్‌, ఫంగిసైడ‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొన్ని తుల‌సి ఆకుల‌ను వేసి బాగా మ‌రిగించి ఆ నీటిని తాగాలి. దీంతో వైర‌ల్ ఫీవ‌ర్ త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

* రెండు టేబుల్ స్పూన్ల ఆవ‌నూనెలో రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను వేసి పేస్ట్‌లా చేయాలి. అనంతరం ఆ మిశ్ర‌మాన్ని కొద్దిగా వేడి చేసి పాదాల‌కు రాయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. తెల్లారేస‌రికి జ్వ‌రం త‌గ్గుతుంది.

* నీటిని బాగా మ‌రిగించి అందులో 2 టీస్పూన్ల దాల్చిన‌చెక్క పొడి వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని తాగాలి. జ్వరం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

* రెండు టీస్పూన్ల తేనెలో కొద్దిగా అల్లం పేస్ట్‌ను క‌లిపి తీసుకుంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి జ్వ‌రం త‌గ్గుముఖం పడుతుంది. శరీరంలో ఎప్పుడు రోగనిరోధక శక్తి తగినంతగా ఉంటె, అసలు రోగాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ, వచ్చినా కూడా వెంటనే తగ్గిపోవడం ఖాయం. అందుకే ఆ తరహా ఆహారాన్ని రోజూవారిలో చేర్చుకోవడం చాలా మంచిది.

Related posts