telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

రిలయన్స్ డిజిటల్ … బ్లాక్ బస్టర్ ఇండియా సేల్‌ … బ్రహ్మాండమైన ఆఫర్లు …

reliance industries block buster sale live

మరోసారి రిలయన్స్ డిజిటల్ బ్లాక్ బస్టర్ ఇండియా సేల్‌కు తెర తీసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్ డిజిటల్ బంపర్ ఆఫర్లు, బెస్ట్ టెక్నాలజీ డీల్స్ తో కూడిన ‘డిజిటల్ ఇండియా సేల్’ ని ప్రకటించింది. ఈ సేల్ లో వినియోగదారులకు అతిపెద్ద ఆఫర్లను అందిస్తోంది. ఈ బ్లాక్ బస్టర్ డీల్స్‌ ఆగష్టు 10 నుండి ఆగస్టు 15, 2019 వరకు అందుబాటులో ఉండనున్నాయి.ఎలక్ట్రానిక్ వస్తువులపై 15శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి కొనుగోలు చేస్తే అదనంగా మరో 10శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వడంతో పాటు 5 శాతం రిలయన్స్ డిజిటల్ క్యాష్ బ్యాక్ కూడా సొంతం చేసుకోవచ్చని తెలిపింది. 360 రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ ఈ ఆఫర్ 360 రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, 2200 మై జియో స్టోర్స్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లు ఆగస్టు 10 నుంచి ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ‘రిలయన్స్ డిజిటల్’ ఆన్ లైన్ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. జీరో డౌన్ పేమెంట్, ఈఎంఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది.

ఈ ఆఫర్‌లో భాగంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్ టాప్ లు భారీ ఆఫర్‌తో లభించనున్నాయి. 55 అంగుళాల టీవీ రూ.39,999కు, 65 అంగుళాల టీవీ రూ.59,990కు, 32 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.10,999కే లభించనుంది. టీవీలు మాత్రమే కాకుండా ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్లపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు రూ.44,990కే లభిస్తున్నాయి. ఇక ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు.. రూ.16,990కే అందుబాటులోకి వచ్చాయి. మెజో జీ6 ప్లస్(6జీబీ) స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9.999కే లభించనుంది. అలాగే న్యూ ఒప్పోఆర్17(8జీబీ) రూ.19,999కే అందనుంది. వీటితో పాటు బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా అందిస్తోంది.రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన 42వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) ఈ రోజు నిర్వహించనుంది. ఉదయం 11:00 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశాన్ని రిలయన్స్ తన యూట్యూబ్, ట్విటర్‌, ఫేస్‌బుక్ ఖాతాలలో ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా ఎప్పటినుంచో కస్టమర్లు ఎదురు చూస్తున్న రిలయన్స్ బ్రాడ్‌బ్యాండ్ జియోగిగా ఫైబర్‌ను కమర్షియల్‌గా లాంచ్‌ చేయనుంది.

Related posts