telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

రిలయన్స్ హెల్త్ ఇన్సురెన్స్ .. 15 నుండి నిలుపుదల.. : ఐ.ఆర్.డి.ఏ.ఐ

reliance health insurance stopped by IRDAI

రిలయన్స్ హెల్త్ ఇన్సురెన్స్ ఆర్థికస్థితి బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఆ కంపెనీ మార్కెట్లో పాలసీలు విక్రయించడాన్ని ఐ.ఆర్.డి.ఏ.ఐ నిషేధించింది. కంపెనీ ఆస్తులతో పాటు పాలసీదారులపై గల బాధ్యతలను రిలయన్స్ జనరల్ ఇన్సురెన్స్‌కు బదలీ చేయాలని తెలిపింది. ప్రస్తుత పాలసీదారుల క్లెయిమ్స్ అన్నింటిని ఆ కంపెనీ చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రిలయన్స్ హెల్త్ సాల్వెన్సీ మార్జిన్ మెరుగుపడే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేవని, అందుకే వ్యాపార కార్యకలాపాలు జరిపితే పాలసీదారులు నష్టపోతారని చెబుతోంది.

15వ తేదీ నుంచి బీమా వ్యాపారం అండర్ రైటింగ్‌ను నిలిపివేయాలని రిలయన్స్ హెల్త్ ఇన్సురెన్స్‌కు ఐ.ఆర్.డి.ఏ.ఐ తెలిపింది. పాలసీలు విక్రయించవద్దని ఆంక్షలు విధించింది.కంపెనీ ఆర్థిక పరిస్థితి నిర్ణీత ప్రమాణాల కంటే బలహీనంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది. పాలసీదారులకు చెందిన డబ్బులు, ఇతరత్రా ఆర్థికపరమైన ఆస్తులను రిలయన్స్ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీలిమిటెడ్‌కు బదలీ చేయాలని సూచించింది. దీంతో ప్రస్తుత పాలసీదారులకు క్లెయిమ్స్ చెల్లించే పరిస్థితి ఉంటుందని తెలిపింది.

Related posts