telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

భలే పండుగ ఆఫర్ .. కిలో బంగారం బహుమతి… రిలయన్స్‌ డిజిటల్‌…

reliance digital kg gold offer

దేశంలో పలు పండుగల సీజన్‌ సందర్భంగా ఆయా సంస్థలు అనేక ఆఫర్లను ప్రకటిస్తూ.. వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు భారీగానే చేస్తున్నాయి. తాజాగా రిలయన్స్‌ డిజిటల్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ పేరిట ఆఫర్‌ను ప్రకటించింది. అక్టోబర్‌ 25 నుంచి 31వరకు కొనసాగనున్న ఆఫర్‌లో టీవీలు, గృహోపకరణాలు, మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ వంటి ఎల్రక్టానిక్స్‌పై 15 శాతం క్యాష్‌బ్యాక్‌ ఉండగా.. విడిభాగాలపైమరో 10 శాతం డిస్కౌంట్‌ ఉన్నట్లు వెల్లడించింది.

లక్కీ కస్టమర్లకు కిలో బంగారం, లగ్జరీ కార్లు, మోటార్‌ సైకిళ్లు, ఎల్‌ఈడీ టీవీలు, ఐ-ఫోన్లను బహుమతులుగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆఫర్‌ కాలంలో మై జియో స్టోర్స్‌లో వోచర్లను సైతం అందిస్తున్నట్లు తెలిపింది.

Related posts