telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా అనుమతి లేకుండా కమల్ ముద్దు పెట్టాడు: నటి రేఖ కామెంట్స్

rekha

కమల్‌హాసన్ గురించి ఓ ఇంటర్వ్యూలో తమిళ ప్రముఖ నటి రేఖ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రేఖ,కమల్ హాసన్ జంటగా 1986లో ‘పున్నగాయ్ మన్నన్’ అనే సినిమా ఒకటి వచ్చింది. అందులో కమల్, రేఖ గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదని చనిపోవాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆత్మహత్య చేసుకునే సన్నివేశం తెరకెక్కిస్తున్నప్పుడు కమల్ హాసన్ రేఖ‌కు ముద్దుపెట్టేసారట. ఈ విషయాన్ని రేఖ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘‘పున్నగాయ్ మన్నన్” సినిమాకు కే.బాలచందర్ దర్శకత్వం వహించారు. మేం సూసైడ్ సీన్ షూటింగ్ చేస్తుంటే ఒక్కసారిగా కమల్ హాసన్ ముద్దు పెట్టేసారు. ఆయన కావాలని చేసింది కాదు అని నాకు తెలుసు. కానీ ముద్దు సీన్ ఉందని నాకు బాలచందర్ కానీ కమల్ హాసన్ కానీ ముందే చెప్పాలి కదా. వాళ్లు చెప్పలేదు. నా అనుమతి లేకుండా కమల్ ముద్దు పెట్టేయడంతో కోపం వచ్చింది. షూటింగ్ అయిపోయాక నేను బాలచందర్ గారి వద్దకు వెళ్లి ఇదే విషయం గురించి అడిగాను. అందుకు ఆయన ఏమన్నారో తెలుసా. ఈ ముద్దు సీన్‌లో తప్పేముంది? ఇద్దరి మధ్య ప్రేమ ఉందని చూపించాలంటే ముద్దు సీన్లు ఉండాల్సిందే అన్నారు.కానీ ఆ సీన్ తర్వాత నాకు కొన్ని రోజుల పాటు నిద్ర లేదు. అదో పీడకలలా నన్ను వెంటాడింది’ అని తెలిపారు

Related posts