telugu navyamedia
andhra news political Telangana telugu cinema news trending

ప్రేమికులారా.. ఇక మీ ఇంట్లోనే … రిజిస్టర్ మ్యారేజ్…

register marriages at their home only

పెళ్లి రిజిస్టర్ చేసుకోడానికి సదరు కార్యాలయానికి వెళ్ళాలి, వాళ్ళు కావాలి అన్న పత్రాలు సమర్పించాలి, తగిన రుసుము చెల్లించాలి, అనంతరం కూడా రిజిస్ట్రార్ అందుబాటులో ఉండాలి.. ఇన్ని తతంగాలు జరిగితేనే పెళ్లి వరకు వెళ్లారు. కానీ తాజాగా ఈ పద్దతి మార్చేశారు. నేరుగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనే వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం, తగిన రుసుము కూడా ఆన్ లైన్ లో చెల్లించడం, అంతే. మీ ఇంటికే రిజిస్ట్రార్ వచ్చేస్తారు.

వధువరుల వ్యక్తిగత వివరాలు(ఐడి, అడ్రస్ ప్రూఫ్, వేలిముద్రలు, సంతకాలు తదితర) ఆన్ లైన్ లో నమోదుచేసుకోవాలి. అనంతరం రిజిస్ట్రార్ ను కూడా ఎంపిక చేసుకోవాలి. ఇవన్నీ పరిశీలించిన అనంతరం రిజిస్ట్రార్ వారి వివాహ వేడుక గురించి ఎస్.ఎం.ఎస్ లేదా మెయిల్ ద్వారా తెలియజేస్తారు. దానిలో నమోదుచేసినట్టుగా, రిజిస్ట్రార్ ఇంటికి వస్తారు, ముగ్గురు సాక్షుల సమక్షంలో పెళ్లిని రిజిస్టర్ చేస్తారు. అనంతరం వెంటనే వివాహ జరిగినట్టు పత్రం(మ్యారేజ్ సర్టిఫికెట్) కూడా ఇస్తారు. ఈ విధానం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో ప్రారంభించారు. ఏటా రాష్ట్రంలో 1.3 లక్షల రిజిస్టర్ మ్యారేజ్ లు జరుగుతున్నాయి. అయితే ఆన్ లైన్ సౌకర్యం వీరందరికి ఇంకా చక్కగా ఉపకరిస్తుందని మంత్రి మోలాయ్ ఘోటక్ తెలిపారు. ఈ మేరకు పశ్చిమబెంగాల్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్ లైన్ విధానం ప్రవేశపెట్టారు.

Related posts

ఏపీ మెజారిటీ ప్రజలు రోడ్ల మీదకు వస్తే హైదరాబాద్ పరిస్థితేంటి: శివాజీ

vimala p

చినజీయర్ స్వామికి తృటిలో తప్పిన ప్రమాదం

vimala p

టాలీవుడ్ కు మరో కొత్త హీరోయిన్

vimala p