telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ పాత్రలే మస్త్ మజా అంటున్న రెజీనా !

అందం, అభినయం రెండూ సమపాళ్లలో ఉన్న నటి రెజీనా కాసాండ్ర. ‘ఎస్ఎంఎస్ – శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రెజీనా.. ఆ తరవాత ‘కొత్త జంట’, ‘పవర్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘అ!’ సినిమాలో తన రూపం, నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి ఏమాత్రం సిగ్గుపడని ఈ బ్యూటీ ‘పవర్’లో రవితేజతో, ‘రారా కృష్ణయ్య’ సినిమాలో సందీప్ కిషన్‌తో హాట్ లిప్ లాక్ సీన్స్‌లో రెజీనా నటించారు. అయితే ఇప్పుడు రెజీనా రొమాంటిక్ సీన్స్‌లో తాను నటించబోనని అంటున్నారు. ఇది ఇలా ఉండగా…  తాజాగా హీరో విశాల్‌ నటించిన తాజా చిత్రం చక్ర. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా ఇటీవలే రిలీజ్‌ అయి.. మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో హీరోయిన్‌ రెజీనా నటించగా.. ఆమె పాత్రకు మంచి మార్కలు పడ్డాయి. అయితే.. దీనిపై ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక నటిగా తనను తాను నిరూపించుకునేందుకే ప్రతినాయక పాత్రలను సైతం చేసేందుకు సిద్ధమని రెజీనా పేర్కొన్నారు.

Related posts