telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్కడ ఫుల్‌ బిజీ అయిపోయిన రెజీనా !

అందం, అభినయం రెండూ సమపాళ్లలో ఉన్న నటి రెజీనా కాసాండ్ర. ‘ఎస్ఎంఎస్ – శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రెజీనా.. ఆ తరవాత ‘కొత్త జంట’, ‘పవర్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘అ!’ సినిమాలో తన రూపం, నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి ఏమాత్రం సిగ్గుపడని ఈ బ్యూటీ ‘పవర్’లో రవితేజతో, ‘రారా కృష్ణయ్య’ సినిమాలో సందీప్ కిషన్‌తో హాట్ లిప్ లాక్ సీన్స్‌లో రెజీనా నటించారు. అయితే ఇప్పుడు రెజీనా రొమాంటిక్ సీన్స్‌లో తాను నటించబోనని అంటున్నారు. ఇది ఇలా ఉండగా… తాజాగా ఓ ట్రైలర్ తో కాస్త హల్ చల్ చేస్తోంది రెజీనా… ‘నెంజమ్ మరప్పతిల్లై’ పేరుతో ఓ సినిమా మార్చ్ 5న విడుదల కాబోతోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్లి, మరెప్పుడో పూర్తైంది. అంతా సరిగ్గా నడిచి ఉంటే 2020 లాక్ డౌన్ కంటే ముందే విడుదల కూడా అయిపోవాల్సింది. కానీ, అనేక అవాంతారాల తరువాత ఈ డిలెయ్డ్ మూవీ ఇప్పుడు వస్తోంది. ‘నెంజమ్ మరప్పతిల్లై’లో రెజీనా హారర్ ట్రై చేసింది. ట్రైలర్ చూస్తే ఆమెకు పర్పామెన్స్ ప్రదర్శించే అవకాశం బాగానే లభించినట్టు అనిపిస్తోంది. అయితే, సెల్వరాఘవన్ దర్శకత్వంలో యువన్ శంకర్ రాజా బాణీలతో ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రెజీనాకు ఎంతో కీలకం. ఇది హిట్ అయితేనే రెజీనా తమిళంలో అయినా బిజీగా కొనసాగ గలదు. లేదంటే తెలుగులోలా అక్కడ కూడా కెరీర్ డల్ అయిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి రెండు, మూడు సినిమాలు రెజీనా ఖాతాలో ఉన్నప్పటికీ టాప్ స్టార్స్ తో రొమాన్స్ చేసే ఛాన్సెస్ మాత్రం తనకి దక్కటం లేదు. చూడాలి మరి, రెజీనా ఫ్యూచర్ ఎలా ఉంటుందో…

Related posts