telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరోయిన్ కు 16 ఏళ్ళ వయసులోనే లైంగిక వేధింపులు

Reese

ప్రముఖ హాలీవుడ్ నటి రీస్ విదర్‌స్పూన్ తాను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను అంటూ సంచలన విషయాలను వెల్లడించారు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టైన్‌ ఎందరో నటీమణులను వేధించినట్లు వార్తలు వెలువడినప్పుడు ‘టైమ్స్ అప్’ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు రీస్ విదర్‌స్పూన్. ఈ ఉద్యమం ద్వారా ఎందరో బండారాలను బయటపెట్టారు. తాజాగా చిన్న వయసులోనే తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి అందరినీ షాక్‌కు గురిచేశారు. తనకు ఎదురైన అనుభవాలను బయటపెట్టడానికి కారణం తాను నటిస్తున్న వెబ్ సిరీసేనని తెలిపారు. “16 ఏళ్ల వయసులో ఓ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు. ఈ విషయం తెలిసి ఏజెంట్స్, ప్రొడ్యూసర్స్ నా నోరు నొక్కేశారు. అదొక్కటే కాదు నా కెరీర్‌లో చాలా సార్లు లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నేను ఈ విషయాలను బయటపెట్టనందుకు ఇప్పటికీ చింతిస్తున్నాను. ఆ సమయంలో ఎందుకు చెప్పలేకపోయానంటే.. నోరు విప్పితే ఎక్కడ నాకు పనిలేకుండా పోతుందోనని. నాకు తెలిసివారికి చెబితే మౌనంగా ఉండమనేవారు. అప్పట్లో కల్చర్ అలాగే ఉండేది. కానీ నేను ఊరుకోలేదు. నా కుటుంబంతో కలిసి న్యాయం కోసం నోరాడాను. నాలాంటి ఎందరో నటీమణులు ఈ వేధింపులను ఎదుర్కొంటున్నారని నాకు అప్పుడు తెలీలేదు. కానీ మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎందరో ఆడవాళ్లు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయాలను బయటపెట్టడం చూసి షాకయ్యాను. ఇంత మంది బాధితులు ఉన్నారా అని అవాక్కయ్యాను. ఒక్కోసారి ఈ ప్రపంచం నాకు క్రేజీగా అనిపిస్తుంటుంది. టీవీ షోలు, సినిమాలే మన స్థాయేంటో తెలియజేస్తాయి” అని తెలిపారు.

Related posts