telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ రెడ్…

Red

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షులను ఆకట్టుకున్నాడు హీరో రామ్. ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమాని చేసాడు. ఇందులో నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాని స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మించగా, మణిశర్మ సంగీతం అందించాడు. అయితే ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించాడు. అయితే గత ఏడాది ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడి ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా విడుదలైంది. మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. వసూళ్లు కూడా భారీగానే రాబట్టింది. అయితే అప్పుడు కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టడంతో రామ్ మూవీకి కూడా ఓటీటీలు ఫ్యాన్సీ రేట్స్ ని ఆఫర్ చేసాయి. కానీ అప్పుడు దర్శకనిర్మాతలు ఈ సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. చెప్పిన ప్రకారమే థియేటర్ లో విడుదల చేసారు. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ అలాగే సన్ నెక్ట్స్ లో ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. మీకు ఈ సినిమా చూడాలి అనిపిస్తే వెళ్లి నెట్‌ఫ్లిక్స్ లేదా సన్ నెక్ట్స్ లో చూడవచ్చు.

Related posts