telugu navyamedia
study news trending

ఏపీ గురుకులాలలో.. 750 ఖాళీల భర్తీ..

another notification in ap for anm

ఆంధ్రప్రదేశ్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న 750 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ ఎస్సీ గురుకుల సొసైటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 1996 తర్వాత తొలిసారిగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా కోఆర్డినేటర్లు 4, ప్రిన్సిపాల్స్‌ 27, టీజీటీలు 552, కేర్‌టేకర్లు(వార్డెన్లు) 167 పోస్టులను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్‌ ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు.

జోన్ల వారీగా ఒకటో జోన్‌లో 79 టీజీటీలు, 32 కేర్‌ టేకర్లు, రెండో జోన్‌లో 159 టీజీటీలు, 41 కేర్‌ టేకర్లు, మూడోజోన్‌లో 163 టీజీటీలు, 41 కేర్‌టేకర్లు, నాలుగోజోన్‌లో 151 టీజీటీలు, 53 వార్డెన్ల పోస్టులను భర్తీ చేస్తారు. ప్రభుత్వం నిర్ణయంపై ఫెడరేషన్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ రెసిడెన్షియల్‌ టీచర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఆర్గనైజేషన్‌ చైర్మన్‌ బి. సాల్మన్‌, సెక్రటరీ జనరల్‌ ఎంఆర్‌సీవీ గిరిబాబు, కార్యదర్శి హర్షవర్ధన్‌లు సీఎం చంద్రబాబు, మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

ఆ దేశంలో అత్యాచారంతో గర్భం దాల్చినా బిడ్డను కనాల్సిందే…!

vimala p

5 రూపాయలు పెరిగిన .. వంట గ్యాస్ ధరలు ..

vimala p

పాక్ సైనికులే ఉగ్రవాదులుగా.. భారత సైన్యంపై దుష్ప్రచారం..

vimala p