telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

స్టాక్ మార్కెట్లలో .. భారీ లాభాల వెల్లువ..

husge loses again in stock markets

ఎన్డీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరుగగా, అప్ ట్రెండ్ తో నడుస్తున్న భారత స్టాక్ మార్కెట్ నేడు తం భారీ లాభాలను నమోదు చేసింది. ఈ ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతానికి 320 పాయింట్లు పెరిగి 40 వేల మార్క్ ను అధిగమించింది.

ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక, 90 పాయింట్లకు పైగా పెరిగి 12 వేల మార్క్ ను దాటి కొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. నిఫ్టీ-50లో 41 కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయి. హీరోమోటో, బజాజ్ ఆటో, బ్రిటానియా, ఐఓసీఎల్ తదితర కంపెనీలు 2 నుంచి 5 శాతానికి పైగా లాభాల్లో నడుస్తుండగా, ఐటీసీ, టెక్ మహీంద్రా, గెయిల్ తదితర కంపెనీలు అర శాతం నుంచి ఒకటిన్నర శాతం నష్టాల్లో ఉన్నాయి.

ఆటోమొబైల్‌ మినహా మిగతా రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. గడచిన మే నెలలో వాహన అమ్మకాలు తగ్గడమే ఇందుకు కారణమని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related posts