telugu navyamedia
సినిమా వార్తలు

భారీ వసూళ్లను కొల్లగొడుతున్న “లయన్ కింగ్”

Lion-King

హాలీవుడ్ సినిమాలు తెలుగులో కూడా విడుదలై అద్భుతమైన వసూళ్లను అందుకుంటున్నాయి. తాజాగా హాలీవుడ్ మూవీ “ద ల‌య‌న్ కింగ్‌” కూడా ఇండియాలో అద్భుతమైన వసూళ్ళను రాబడుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీస్ ఈ చిత్రాన్ని ఆద‌రిస్తున్నారు. పిల్ల‌ల‌తో పాటు వ‌చ్చి 3డి ల‌య‌న్ కింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో క‌లెక్ష‌న్స్ హ‌వా క‌నిపిస్తుంది. ఇస్మార్ట్ శంక‌ర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్నా కూడా దాన్ని త‌ట్టుకుని భారీ వ‌సూళ్లు రాబ‌డుతుంది ల‌య‌న్ కింగ్. తెలుగులో నాని, ర‌విశంక‌ర్, జ‌గ‌ప‌తిబాబు లాంటి వాయిస్ కూడా సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. జంగిల్ బుక్ త‌ర్వాత మ‌రోసారి అదే ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన ల‌య‌న్ కింగ్ రికార్డులు తిర‌గ‌రాస్తూ ముందుకు దూసుకెళ్లిపోతుంది. డిస్నీ రూపొందించిన ఈ సినిమా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న‌ది. దేశ‌వ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల్లోనే 54.75 కోట్లు ఆర్జించింది. 1994లో వ‌చ్చిన ద ల‌య‌న్ కింగ్ సినిమానే.. కంప్యూట‌ర్ యానిమేష‌న్ టెక్నాల‌జీతో రూపొందించి రిలీజ్ చేశారు. సినిమాలోని సింబా, ముఫాసా క్యారెక్ట‌ర్లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. ఇండియాలో మొత్తం 2140 స్క్రీన్ల‌లో సినిమాను విడుద‌ల చేశారు. ఇంగ్లీస్‌, హిందీ, త‌మిల్‌, తెలుగు భాషాల్లో సినిమా రిలీజైంది. మొద‌టి రోజు ఈ సినిమాకు 13.17 కోట్లు వ‌చ్చాయి. భార‌త్‌లో అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్‌, అవెంజ‌ర్స్ ఇన్ఫినిటీ వార్ త‌ర్వాత అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన హాలీవుడ్ సినిమాగా ద ల‌య‌న్ కింగ్ నిలిచింది.

Related posts