telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీ : .. నూతన రవాణా చట్టం రికార్డు .. ట్రక్కుకు 2 లక్షల జరిమానా..

record challan in delhi to a truck about 2 laks

కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రమాదాలు నివారించడానికే అధిక జరిమానాలు విధిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం నూతన రవాణా చట్టం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిమానాలు పెద్ద మొత్తంలో ఉండటమే ఇందుకు కారణంగా ఉంది. ఢిల్లీలోని ముకర్బా ప్రాంతంలో చోటుచేసుకున్న తాజా ఘటన ఇప్పటి వరకు నమోదైనటువంటి జరిమానాల రికార్డు తిరగరాసింది. నియమాలు ఉల్లంఘించినందుకు గాను ఓ ట్రక్కు డ్రైవర్‌కు రూ. 2 లక్షలకు పైగా జరిమానా విధించారు.

నూతన చట్టం ప్రకారం ఓవర్‌ లోడ్‌ కారణంగా సదరు ట్రక్కు డ్రైవర్‌ 2 లక్షల 500 రూపాయాలను జరిమానాగా చెల్లించాలి. ట్రక్కు డ్రైవర్‌ రామ్‌ కిషన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్నందుకు గాను నూతన చట్టం ప్రకారం రూ. 20 వేలు జరిమానా విధింపు. దీంతో నిర్దేశించిన లోడ్‌కు మించి తీసుకువెళ్తున్న ప్రతీ టన్నుకు రూ. 2 వేల జరిమానా విధింపు.

Related posts