telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనాపై యుద్ధానికి ప్రభాస్ చెల్లెళ్ళ విరాళం

Rebel

ప్రధానమంత్రి కరోనా సహాయనిధి కోసం రాష్ట్రంలో ప్రముఖులు పెద్ద ఎత్తున సాయం ప్రకటిస్తున్న విషయం మనకు తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే కరోనా బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో 50 లక్షలు అనౌన్స్ చేసాడు. అంతేకాదు ప్రధాన మంత్రి సహాయ నిధికి కూడా రూ. 3 కోట్ల విరాళం అందించాడు. తాజాగా ప్రభాస్.. టాలీవుడ్ కార్మికుల సహాయార్ధం మరో రూ.50 లక్షల విరాళం ప్రకటించి మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడు. మొత్తంగా ప్రభాస్.. కరోనా సహాయార్ధం రూ.4.5 కోట్లను విరాళం ప్రకటించారు. ఇదిలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కుటుంబాలలో అత్యధిక విరాళం అందించినటువంటి కుటుంబాలలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి కుటుంబం ముందుంది. తాజాగా మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ నటుడు కృష్ణం రాజు ముగ్గురు కుమార్తెలు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెల్లెళ్లు ప్రదీప్తి, ప్రసీద, ప్రకీర్తి, ప్రధానమంత్రి సహాయ నిధికి తమ వంతు సాయం చేశారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి జన్మదిన సందర్భంగా నాలుగు లక్షల రూపాయలు, అదే విధంగా వారి ముగ్గురు కుమార్తెలు కూడా తమ పాకెట్ మనీనుంచి తలా రెండు లక్షల రూపాయలు అంటే మొత్తం కలిపి 10 లక్షలు ప్రధానమంత్రి సహాయ నిధి కోసం ఈరోజు విరాళంగా ఇచ్చారు. ప్రధానమంత్రి ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగానికి స్ఫూర్తి పొంది తమ వంతు సాయంగా తమ పాకెట్ మనీని పీఎం కేర్ ప్రధానమంత్రి కరోనా సహాయ నిధికి అందజేస్తున్నట్లు ప్రదీప్తి, ప్రసీద, ప్రకీర్తి చెప్పుకొచ్చారు. మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రజలందరూ కరోనా మహమ్మారిపై యుద్ధం చేయాలని కోరారు. అందుకోసం దేశమంతా ఒక తాటిమీద నడుస్తుందన్న భావన ప్రతి ఒక్కరిలో కలిగించిన మోడీ గారికి కృతజ్ఞతగా తన జన్మదినం సందర్భంగా నాలుగు లక్షల రూపాయలు ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్లు శ్యామల దేవి ప్రకటించారు.

Related posts