telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

ఏమి లేదంటూనే.. ఎన్ని కుంభకోణాలో..! అవే వైసీపీకి దారి చూపాయేమో .. !!

reasons for raghuramakrishnam raju into ycp

ఏపీలో ప్రధాన పార్టీల మధ్య ఆకర్ష్ పథకం ఫలించడం లేదు, దీనితో బ్లాక్ మెయిల్ పథకం ప్రారంభించారు. అంటే ఆకర్ష్ అందరికి తెలిసిందే, ఏ పదవో ఇస్తామంటే తోక ఊపుకుంటూ వచ్చేస్తారు.. ఇక అలా రాని వారి బయో డేటా ను క్షుణ్ణంగా పరిశీలించి, దానిలో ఏమైనా లుకలుకలు ఉంటె.. వాటిని బయటకు తీసి, బెదిరించి.. మొత్తానికి తమ పార్టీలోకి తెచ్చేసుకుంటారు. ప్రస్తుతం ఇదే జరుగుతుంది ఏపీ రాజకీయాలలో; ప్రధానంగా వైసీపీ-టీడీపీ మధ్య ఈ యుద్ధమే జరుగుతుంది. అందుకే ఎవరు ఎప్పుడు పార్టీ మారతారో తెలియటంలేదు. అయితే ఇదంతా జరగడానికి తెరవెనుక పాత్ర పోషిస్తున్న అజ్ఞాతవాసి మాత్రం బీజేపీ అని రాజకీయ వర్గాలు సుస్పష్టంగా చెప్పేస్తున్నాయి. ఇక చేరికలు ఎన్ని జరిగినా, తాజాగా వైసీపీలో చేరిన రఘురామకృష్ణంరాజు గురించి తప్పకుండ మాట్లాడుకోవాలి. ఆయన చేరగానే అన్న మాటలు ఒక్కసారి చూస్తే, ‘నాకు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారాలు లేవు.. నన్ను ఎవరూ బెదిరించలేదు.. నాకు నేనుగానే వైసీపీలో చేరాను..’ అన్నాడు.

అలా ఎందుకు అన్నాడో కూడా తెలిసినా, అది కూడా చూద్దాం; కొంత కాలంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఆస్తులు, వ్యాపారాలున్న వారిని బెదిరించి.. వైసీపీలో చేర్పిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కౌంటర్‌గా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. కానీ.. ఆయన వ్యాపారాలకు హైదరాబాద్ కేంద్రం కావటం గమనార్హం. అయితే వ్యాపారం జరిగేది మాత్రం ఇతర రాష్ట్రాలలోనే.. అక్కడ ఆయన చేసిన ఘనకార్యాలు పెద్దగా బయటకు రాలేదు కానీ. వివిధ సంస్థల పేరుతో దాదాపుగా రూ. 3వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టారు. వీటినే ఆయువు పట్టుగా.. పట్టుకున్న బీజే్పీ నేతలు.. బలవంతంగా వైసీపీలో చేర్పించారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్ బిల్డింగ్ ఎదురుగానే ఇండ్-భారత్ కంపెనీ కార్యాలయం ఉంటుంది. ఇది వివిధ రుణ సంస్థల నుంచి రూ. 3వేల కోట్లు తీసుకుని ఎగ్గొట్టేసింది. దీనికి చైర్మన్ రఘురామకృష్ణం రాజు. ఈయన ఇండ్‌-భారత్‌ పవర్‌ (మద్రాస్‌) లిమిటెడ్‌, ఇండ్‌-భారత్‌ పవర్‌ ఇన్‌ఫ్రా (ఐబీపీఐఎల్‌), ఇండ్‌ భారత్‌ ఎనర్జీ (ఉత్కల్‌)లిమిటెడ్‌ ..వంటి కంపెనీలను ఏర్పాటు చేశారు. ఇలా దాదాపుగా పన్నెండు కంపెనీలు ఉన్నాయి. విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తామంటూ ఈ కంపెనీలు దేశవిదేశాల్లోని వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు.

భారత్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ , రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ , ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి రూ. వెయ్యి కోట్లు రుణాలు తీసుకున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రాజెక్టులు నిర్మించలేదు. తీసుకున్న రుణాలన్నీ దారి మళ్లించారు. ప్రాజెక్టుల్లో 20 శాతం కూడా నిర్మాణం కాలేదు. ఈ రుణాలు 2016లోనే మొండి బకాయిలుగా మారాయి. ఈ సంస్థ ఫిర్యాదు మేరకు.. రఘురామకృష్ణంరాజుపై.. ఢిల్లీలో కేసు నమోదు అయింది.

ఆస్ట్రేలియాకు చెందిన అసెట్ మెనేజ్ మెంట్ కంపెనీ.. మెక్‌క్వరీ కూడా.. దాదాపుగా రూ. 800 కోట్లు ఇండ్ భారత్ కంపెనీలు ఎగ్గొట్టాయని భారత కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసి ఉన్నాయి. రఘురామకృష్ణం రాజు పెట్టిన కంపెనీల్లో ఓ రెండు కంపెనీలు.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి తీసుకున్న రూ.167 కోట్ల రుణం తిరిగి చెల్లించడంలో విఫలమమయ్యాయి. ఈ మొత్తం రుణాలు, ఎగవేతల వ్యవహారం.. దాదాపుగా రూ. 3వేల కోట్లు ఉంటుంది. ఈ కేసులన్నీ ఇప్పుడు కోర్టులతో పాటు.. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ వద్ద ఉన్నాయి. రుణాలు ఇచ్చిన కంపెనీలన్నీ. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై తదితర చోట్ల కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ఆయా కంపెనీలను దివాలా తీసినట్లు ప్రకటించి.. తమ సొమ్ము తాము రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ప్రస్తుతం రఘురామకృష్ణంరాజుకు చెందిన కంపెనీల ఆస్తుల క్రయ విక్రయాలపై నిషేధం ఉంది. ఆస్తులకు సంబంధించి తాకట్టులు విడిపించడం, కోర్టు తీర్పులను అమలు చేయడం, కోర్టుల్లో కేసులు దాఖలు చేయడం వంటి చర్యలు చేపట్టకూడదు. తేడా వస్తే.. ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కొసమెరుపేమిటంటే.. ఈయన కంపెనీలన్నీ.. వైఎస్ సీఎం అయిన తర్వాతే సృష్టించారు. ఆ తర్వాత రుణాలు పరుగులు పెట్టుకుంటూ వచ్చాయి. వాటిని ఎగ్గొట్టడం కూడా అంతే వేగంగా జరిగిపోయాయి. ఈయన వైఎస్ ఆత్మగా పేరు పొందిన కేవీపీకి వియ్యంకుడు. గతంలో సీబీఐ అధికారులు, ఈడీ కూడా దాడులు చేసింది. తర్వాత సైలెంటయిపోయాయి. ఆయనను బెదిరించి వైసీపీలో చేర్చడానికి బహుశా ఈ ఒక్క కారణం సరిపోతుందేమో..! ఏమి లేదంటూనే ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో, ఇంకా తీగలాగితే ఎన్ని డొంకలు కదులుతాయో.. అని ఆయన కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్టుగా ఉంది. మొత్తానికి బీజేపీ కూడా బలవంతపు పెళ్లిళ్లు చేస్తుందన్నమాటే..!!

Related posts