• Home
  • వార్తలు
  • రేవంత్ రెడ్డి తెలంగాణ జ‌గ‌న్…??? దాడుల వెన‌క కేసీఆర్ వ్యూహం
రాజకీయ వార్తలు వార్తలు సమీక్ష వార్తలు

రేవంత్ రెడ్డి తెలంగాణ జ‌గ‌న్…??? దాడుల వెన‌క కేసీఆర్ వ్యూహం

KCR, REVANTH REDDY
స‌ర్వం సిద్ధం చేసుకుని ముంద‌స్తు రంగంలోకి దిగిన కేసీఆర్ అసెంబ్లీ ర‌ద్దు త‌ర్వాత త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నారా? అధికారం ఎలాగైనా ద‌క్కించుకోవాల‌న్న ఆతృత‌లో విచక్ష‌ణ‌ను మ‌రిచిపోతున్నారా…? బ‌య‌టి ప్ర‌త్య‌ర్ధుల‌ను, లోప‌లి ప్ర‌త్యర్ధుల‌ను నిలువ‌రించే క్ర‌మంలో అహంకార‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా..? అధికారం అండ‌తో ఏమైనా చేయొచ్చ‌న్న కేసీఆర్ ఆలోచ‌న ఎన్నిక‌ల వేళ ప్ర‌జ‌ల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తోందా..? జ‌గ్గారెడ్డి మొద‌లుకుని రేవంత్ రెడ్డి దాకా కాంగ్రెస్ నేత‌ల‌పై న‌మోద‌వుతున్న కేసులను క‌క్ష సాధింపు చ‌ర్య‌లుగానే తెలంగాణ స‌మాజం చూస్తోందా…? ఐటీ, ఈడీ దాడుల‌తో రేవంత్ ను కేసీఆరే తెలంగాణ హీరోగా మారుస్తున్నారా…? 
IT Raids on Congress Party Working President Revanth Homes
తెలంగాణ‌లో తాజా ప‌రిణామాలు గ‌మ‌నిస్తే ఇవ‌న్నీ నిజ‌మేన‌నిపిస్తుంది. ఆత్మ‌విశ్వాసంతోనో, అతివిశ్వాసంతోనో ముందస్తుకు స‌మ‌ర‌భేరీ మోగించిన కేసీఆర్ ఎన్నిక‌ల క్షేత్రంలో ప్రత్య‌ర్ధుల‌ను ఎదుర్కోవ‌డం క‌న్నా…అధికారం చాటున వారిని అణ‌గదొక్క‌డానికి శ‌క్తివంచ‌న‌లేకుండా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అట్ట‌హాసంగా ప్ర‌గ‌తినివేద‌న స‌భ నిర్వ‌హించి, ఆ స‌భ అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌న్న టాక్ వ‌చ్చిన త‌ర్వాత కూడా వెనక‌డుగు వేయ‌కుండా అసెంబ్లీ ర‌ద్దు చేసిన కేసీఆర్ హుజూరాబాద్ స‌భ‌ను కూడా అంతే ఉత్సాహంగా జ‌రిపి ఆ తర్వాత ఎందుకో హ‌ఠాత్తుగా వెన‌క్కి త‌గ్గారు. 50రోజుల్లో వంద స‌భ‌లు జ‌రుపుతాన‌ని ప్ర‌క‌టించిన కేసీఆర్ హుజూరాబాద్ స‌భ త‌ర్వాత మ‌ళ్లీ స‌భ ఊసే ఎత్త‌డం లేదు. మ‌రి ఆయ‌న ఏం చేస్తున్నారు? ఫామ్ హౌస్ లో కూర్చుని స‌మ‌ర‌గేయాలు రాస్తున్నార‌ని మీడియాలో వార్త‌లొస్తున్నాయి.
early elections effect on kcr
ఇందులో నిజ‌మెంతో తెలియ‌దు కానీ….హుజూరాబాద్ స‌భ త‌ర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల పాత కేసుల‌ను తిర‌గ‌తోడే ప‌నిలోనూ, కొత్త కేసులు న‌మోదుచేయించే ప‌నిలోనూ బిజీగా ఉన్నార‌ని మాత్రం అంద‌రికీ అర్ధ‌మవుతోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల వేళ  కేసీఆర్ ఇలా కాంగ్రెస్ నేత‌ల‌ను భ‌య‌పెట్టి, ఎన్నిక‌ల క్షేత్రంలో వారిని త‌ప్పించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలను గ‌మ‌నిస్తున్నతెలంగాణ ప్ర‌జ‌లు ప‌లుర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు. వంద‌సీట్లు సాధిస్తామ‌ని ఆర్భాటంగా పైకి ప్ర‌క‌ట‌నలు చేస్తున్నారు గానీ నిజానికి కేసీఆర్ కు, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ కు టీఆర్ ఎస్ గెలుపుపై ఏ మాత్రం న‌మ్మ‌కం లేదని, అందుకే ప్ర‌త్య‌ర్ధుల‌ను కేసుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నార‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ క‌లిసి ఏర్పాటుచేసుకుంటున్న మ‌హాకూట‌మి చ‌ర్చ‌లు ఇంకా ఓ కొలిక్కి రాక‌ముందే కేసీఆర్ కూట‌మిని దెబ్బ‌తీసే వ్యూహంతో ముందుకు వెళ్తున్నార‌ని,  ఓటుకు నోటు కేసు ద్వారా చంద్ర‌బాబును ఇరుకున పెట్టేందుకే రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులు చేయిస్తున్నార‌న్న‌ది తెలంగాణ‌లో జ‌రుగుతున్న ప్ర‌చారం. ఎక్కువ‌మంది ప్ర‌జ‌లు ఈ వాద‌న‌ను అంగీక‌రిస్తున్నారు కూడా. సోష‌ల్ మీడియాలో రేవంత్ కు అనుకూలంగా వెల్లువెత్తుతున్న పోస్టులే ఇందుకు నిద‌ర్శ‌నం.
Police Chased a Missing Case by use Facebook
ఈ దాడుల ద్వారా రేవంత్ రెడ్డి అంటే త‌న‌కు ఎంత భ‌యమో కేసీఆర్ మ‌రోసారి నిరూపించుకున్నార‌ని వ్యంగాస్త్రాలు కూడా విన‌ప‌డుతున్నాయి. కేసీఆర్ ఏ ఉద్దేశంతో ఇలాంటి క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లోకి ఇవి త‌ప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయ‌న్న‌ది మాత్రం కాద‌న‌లేని నిజం. అస‌లు కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలిపైనే తెలంగాణ‌లో బాగా వ్య‌తిరేక ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లో ఆయ‌న మీద ఉన్నంత సానుకూల‌త కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత లేద‌న్న‌ది అంద‌రూ ఒప్పుకునేదే. ఉద్య‌మ‌నేత‌గా ప్ర‌జ‌ల్లో మ‌మేక‌మ‌యిన కేసీఆర్ కు, ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కే రాని కేసీఆర్ కు చాలానే తేడా ఉంది. అధికారం వ‌ల్ల నాయ‌కుల్లో స‌హ‌జంగా వ‌చ్చేమార్పు కేసీఆర్ ను తెలంగాణ స‌మాజం ముందు అహంభావిగా నిల‌బెట్టింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఉద్య‌మ స‌మ‌యంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలు ఎదురైనా ప్ర‌జ‌ల‌మ‌నిషిగా ఉన్న కేసీఆర్ ముఖ్య‌మంత్రికాగానే త‌న వైఖ‌రి పూర్తిగా మార్చుకున్నార‌ని, త‌న‌కు ఎదురేలేద‌న్న‌ట్టుగా ఉంటున్నార‌ని, తిమ్మిని బ‌మ్మిని చేయ‌గ‌ల శ‌క్తిసామ‌ర్థ్యాలు త‌న‌కున్నాయ‌న్న‌ అతివిశ్వాసం ప్ర‌దర్శిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. 
KCR, REVANTH REDDY
నాలుగ‌న్న‌రేళ్ల కాలంలో తాను ఎలా ఉన్న‌ప్ప‌టికీ… ఎన్నిక‌లస‌మ‌యంలో బ‌హిరంగ‌స‌భలో తాను ఓ మంచి ప్ర‌సంగం చేస్తే చాలు తెలంగాణ ఓట‌ర్లు త‌న‌వైపుకు తిరిగిపోతారన్న అపార విశ్వాసంతోనే కేసీఆర్ ముంద‌స్తు సాహ‌సం చేశార‌ని, అలాంటి ప‌దునైన ప్ర‌సంగంతో ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేందుకే హుజూరాబాద్ స‌భ త‌ర్వాత మౌనంగా ఉన్నార‌ని కొంద‌రంటున్నారు. నిజానికి అంత విశ్వాస‌మే ఉంటే కేసీఆర్ ఇలా ప్ర‌త్య‌ర్దుల‌పై ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై కక్ష‌సాధింపుల‌కు దిగాల్సిన ప‌నిలేదన్న‌ది ఓ అభిప్రాయం. అసెంబ్లీ ర‌ద్దు త‌ర్వాత కేసీఆర్ కు తెలంగాణ‌లో అస‌లు స్థితి అర్ద‌మ‌యింద‌ని, అనుకున్నంత తేలిగ్గా గెలుపు సాధ్యం కాద‌ని గ్ర‌హించ‌డం వ‌ల్లే ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌జాకోర్టులో దోషిగా నిల‌బెట్టేందుకు కేసుల అస్త్రాలు ఉప‌యోగిస్తున్నారని విమ‌ర్శ‌కులు మండిప‌డుతున్నారు. అధికారం మాటున దాచిన ప్ర‌జ‌ల అసంతృప్తిని ప్ర‌త్య‌క్షంగా గ‌మ‌నించిన త‌ర్వాత కేసీఆర్ కు ఎన్నిక‌లంటే భ‌యం ప‌ట్టుకుంద‌ని, ఆ క్ర‌మంలో అధికారం ఎలాగైనా చేజిక్కించుకునేందుకు రేవంత్ రెడ్డి లాంటి బ‌ల‌మైన నేత‌ల ఇమేజ్ ను దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని  అంటున్నారు.  అల్లాట‌ప్పాగా కాకుండా రేవంత్  చుట్టూ ఉచ్చుబిగించేలా, ఆయ‌న‌ను అక్ర‌మ సంపాద‌నాప‌రుడిగా చిత్రీక‌రించేలా ప‌క‌డ్బ‌దీంగా స్కెచ్ వేసిన‌ట్టు అర్ధ‌మ‌వుతోంది. రూ. వెయ్యికోట్ల అక్ర‌మాస్తులు రేవంత్ రెడ్డికి ఉన్న‌ట్టు…భార‌త్ లోనే కాక‌, హాంకాంగ్, మలేషియా వంటి చోట్ల కూడా ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్టు వ‌స్తున్న వార్త‌ల్లో నిజానిజాలు ద‌ర్యాప్తులో తేల‌తాయి కానీ…దాడులతో ఈ  విష‌యాల‌న్నీచ‌ర్చ‌కు వ‌చ్చేలా చేయ‌డం ద్వారా రేవంత్ రెడ్డి క‌నిపించేంత స‌చ్ఛీలుడు కాద‌న్న అభిప్రాయాన్ని ప్ర‌జ‌ల్లో క‌లిగించాల‌న్నదే కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.
ed to open revanthreddy bank lockers today
మొత్తంగా రేవంత్ రెడ్డిని అక్ర‌మార్కుడుగా..ఇంకా చెప్పాలంటే తెలంగాణ జ‌గ‌న్ గా ప్ర‌జ‌ల ముందు ఉంచాల‌న్న‌ది కేసీఆర్ ఉద్దేశం. అయితే కేసీఆర్ వ్యూహాలు ఆయ‌న అనుకున్న ఫ‌లితాలు ఇస్తాయా లేదా అన్న‌దే ఇక్క‌డ త‌లెత్తుతున్న ప్ర‌శ్న‌. నిజానికి ఓ సాధార‌ణ ఎమ్మెల్యే రూ. వెయ్యికోట్ల అధిప‌తిగా మారాడ‌న్న ఆరోప‌ణ క‌చ్చితంగా త‌ప్పుడు సంకేత‌మే. రెండురోజులుగా వ‌స్తున్న ఐటీ దాడుల వార్త‌లతో రేవంత్ రెడ్డి వ్య‌వ‌హార‌శైలిపై విస్తృత చ‌ర్చ‌జ‌రుగుతుంద‌న్న‌దీ నిజ‌మే. అయితే ఎన్నిక‌ల వేళ జ‌రిగిన ఈ దాడుల‌ను మ‌రోకోణంలోనుంచి అంద‌రూ గ‌మ‌నిస్తున్నారు. రేవంత్ రెడ్డి అక్ర‌మాస్తులు కూడబెట్టింది నిజ‌మేఅనుకున్నా..స‌రిగ్గా ఎన్నికల వేళ ఈ దాడులు జ‌ర‌గడాన్ని క‌క్ష‌సాధింపు చ‌ర్య‌గానే మెజారిటీ ప్ర‌జ‌లు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ దాడులు ద్వారా  కేసీఆర్ త‌నంత‌తానుగా రేవంత్ ను త‌న‌కు దీటైన ప్ర‌త్య‌ర్ధిగా  ప్ర‌జ‌లు ముందు ఉంచుతున్నార‌న్న అభిప్రాయానికి అంతా  వ‌స్తున్నారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వంలో ఎన్నో ఎత్తుల‌తో ప్ర‌త్య‌ర్దుల‌ను చిత్తుచేసిన కేసీఆర్ రాజ‌కీయంగా, త‌న‌కు, కుమారుడికి అత్యంత కీల‌క‌మైన త‌రుణంలో ఇలాటి త‌ప్పుడు వ్యూహాలు ఎందుకు ర‌చిస్తున్నార‌న్న‌దే అంతుచిక్క‌ని ప్ర‌శ్న.  కేసీఆర్ ఊహించిన‌ట్టు ఐటీ దాడుల‌తో రేవంత్ ఇమేజ్ దెబ్బ‌తింటుందా లేక దెబ్బ‌తిన్న బెబ్బులిలా రేవంతుడు మ‌రింత బ‌ల‌మైన నేతగా మార‌తారా అన్న‌ది ఎన్నిక‌ల్లో తేలిపోనుంది. 

Related posts

“అరవింద సమేత వీర రాఘవ” మా వ్యూ

vimala t

భర్తకు ముద్దిస్తూ సగం నాలుకను కొరికేసిన భార్య… ఆమె ఇప్పుడు గర్భిణీ

nagaraj chanti

భారత్ ను అభివృద్ధి చేయండి…

admin

Leave a Comment