telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

అదిరిపోయే స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసిన రియల్ మీ… ఫీచర్స్ ఇవే

real-me

రియల్ మీ స్మార్ట్ వాచ్‌ను ఎట్టకేలకు లాంచ్ చేసింది. కలర్ డిస్ ప్లే, 2.5డీ కర్వ్‌డ్ గ్లాస్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. రియల్ మీ వాచ్ ధరను రూ.3,999గా నిర్ణయించారు. జూన్ 5వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. రియల్ మీ, ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. త్వరలో ఆఫ్ లైన్ లో కూడా దీన్ని విక్రయించనున్నారు. రెడ్, బ్లూ, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఇప్పుడు ఉన్న ఎన్నో స్మార్ట్ వాచ్ ల తరహాలో రియల్ మీ వాచ్ లో కూడా ఫిట్ నెస్, స్మార్ట్ ఫీచర్లు ఎన్నిటినో అందించారు. ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా అందించారు, ప్రతి ఐదు నిమిషాలకు మీ గుండె చప్పుడును రికార్డ్ చేస్తుంది. మీ గుండె వేగం ఎక్కువైనా, తక్కువైనా వెంటనే మిమ్మల్ని అలెర్ట్ చేస్తుంది. దీంతో పాటు బ్లడ్ ఆక్సిజన్ స్థాయిని కూడా దీని ద్వారా గుర్తించవచ్చు. బ్యాడ్మింటన్, క్రికెట్, ఇండోర్ రన్, అవుట్ డోర్ రన్, వాక్, యోగా వంటి 14 స్పోర్ట్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. స్లీప్ మానిటరింగ్, సెడెంటరీ రిమైండర్స్, హైడ్రేషన్ రిమైండర్, మెడిటేషన్ రిలాక్సింగ్ వంటి ఫీచర్లను కూడా ఇందులో అందించడం విశేషం.

మీ స్మార్ట్ వాచ్ లో ఉన్న యాప్స్ కు సంబంధించిన నోటిఫికేషన్లను కూడా ఈ వాచ్ లో చూసుకోవచ్చు. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ మెసేజ్ ల వంటి నోటిఫికేషన్లు కూడా దీని ద్వారా మీకు లభిస్తాయి. మీ స్మార్ట్ ఫోన్ కెమెరాను కూడా ఈ వాచ్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. యాపిల్ వాచ్ లేదా ఇతర ప్రీమియం స్మార్ట్ వాచ్ ల ద్వారా రియల్ మీ వాచ్ ను వాయిస్ కాల్స్ అటెండ్ చేయడానికి ఉపయోగించలేం. అయితే కాల్ ను రిజెక్ట్ చేయడం లేదా మ్యూట్ లో పెట్టడం వంటి అంశాలను మాత్రం నేరుగా స్మార్ట్ వాచ్ నుంచే చేయవచ్చు. రియల్ మీ లింక్ యాప్ ద్వారా మీరు దీనికి మరిన్ని కస్టమైజేషన్లు కూడా చేయవచ్చు. రియల్ మీ వాచ్ లో 12 వాచ్ ఫేస్ లు ఉన్నాయి. అలాగే దీని డీఫాల్ట్ వాచ్ ఫేస్ టైమ్, డేట్, వాతావరణం, మీరు వేసే అడుగులు, గుండె చప్పుడు, కేలరీలు వంటి వాటిని ఈ వాచ్ డీఫాల్ట్ గా డిస్ ప్లే చేస్తుంది. ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 1.4 అంగుళాల డిస్ ప్లేను అందించారు. టచ్ స్క్రీన్ సపోర్ట్ కూడా ఉంది. 2.5డీ కార్నింగ్ గొరిల్లా ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ లో 3-యాక్సిస్ యాక్సెలరో మీటర్, పీపీజీ సెన్సార్ ఫీచర్లను అందించారు. 20 ఎంఎం రిమూవబుల్ వాచ్ స్ట్రాప్ లను కూడా వీటి ద్వారా అందించారు. ఐపీ68 సర్టిఫైడ్ బిల్డ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఇందులో ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఇందులో ఉంది. బ్లూటూత్ వీ5.0 ఫీచర్ ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ లేదా దానికంటే తర్వాత వెర్షన్ ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేసే స్మార్ట్ ఫోన్లను ఈ వాచ్ సపోర్ట్ చేయనుంది. ఇందులో 160 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

Related posts