telugu navyamedia
telugu cinema news trending

హీరోయిన్లని వెంటాడుతోన్న వెయిట్‌ ప్రాబ్లమ్స్‌

Tollywood

ఇండస్ట్రీలో టాలెంట్‌ ఉన్నోళ్లకి తిరుగుండదు అంటారు. కానీ కొంతమంది హీరోయిన్ల దగ్గర టన్నుల కొద్ది టాలెంట్‌ ఉన్నా అవకాశాలు మాత్రం రాట్లేదు. చాలామంది స్టార్ హీరోయిన్ల జర్నీకి బరువుతో బ్రేకులు పడుతున్నాయి. హెవీ వెయిట్‌తో చాలామంది టాలెంటెడ్‌ హీరోయిన్లు కష్టాల్లో పడుతున్నారు. సౌత్‌ లేడీ సూపర్‌స్టార్‌గా కొన్నాళ్లపాటు హంగామా చేసిన అనుష్కకి ఇప్పుడు సినిమాలే లేవు. మరి భారీ సినిమాలకు ఫస్ట్ ఆప్షన్‌గా కనిపించిన స్వీటీకి ఇప్పుడు సినిమాలు లేకపోవడానికి బరువు పెరగడమే కారణమంటున్నారు. అనుష్క బొద్దుగా కనిపిస్తుందని సీనియర్‌ హీరోలు కూడా ఈమెని పక్కన పెట్టేస్తున్నారు. దీంతో ‘నిశ్శబ్ధం’ తర్వాత అనుష్కకి మరో సినిమా రాలేదు. హీరోయిన్ కమ్ సింగర్‌ కమ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మల్టీ టాలెంట్స్‌ చూపించిన నిత్యమీనన్‌కి కూడా ఇప్పుడు సరైన సినిమాల్లేవు. మరి నిత్యాకి అవకాశాలు తగ్గిపోవడానికి బరువు పెరగడమే కారణమని చెప్పొచ్చు. అందుకే ‘జనతాగ్యారేజ్’ తర్వాత నిత్య మళ్లీ లీడ్‌ రోల్స్‌లో కనిపించలేదని చెప్తున్నారు టాలీవుడ్‌ జనాలు. బాలీవుడ్‌ డర్టీ గర్ల్‌ విద్యాబాలన్‌ కెరీర్‌ కూడా బరువు సమస్యలతోనే కష్టాల్లో పడింది. పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్‌ లాంటి వాళ్లు హీరోయిన్లుగా హంగామా చేస్తోంటే విద్య మాత్రం పెద్దగా రాణించలేకపోతోంది. వెయిట్‌ ఇష్యూస్‌తోనే ఈమెకి భారీ ఆఫర్స్‌ రాట్లేదని చెప్తున్నారు బాలీవుడ్ జనాలు.

Related posts

శ్రీదేవి లేనిదే ఆ సినిమా లేదు… : మెగాస్టార్

vimala p

ఇక్కడుంది లవర్ బోయ్ కాదుబే.. ఆరడుగుల మిసైల్… “లాస్ట్ పెగ్” టీజర్

vimala p

కేసును మర్యాదగా వెనక్కి తీసుకోకపోతే… శ్రీరెడ్డి దారుణమైన పోస్టులు

vimala p