• Home
  • వార్తలు
  • ముందస్తు ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు: అమిత్‌షా
రాజకీయ వార్తలు వార్తలు

ముందస్తు ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు: అమిత్‌షా

Amit Shah BJP, Telangana Elections, Hyderabad

తెలాంగాణలో ముందస్తు ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆ పార్టీ నేతలకు సూచించారు. మంత్రాలయం వెళ్లేందుకు గురువారం హైదరాబాద్‌ వచ్చిన ఆయన శంషాబాద్‌ విమానాశ్రయంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టడం, మోదీ ప్రభుత్వ పథకాల ప్రచారం, ప్రధాన పార్టీల్లో అసంతృప్తులను ఆకర్షించడంపై దృష్టి సారించాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ నేతలకు దిశా నిర్దేశం చేశారు.

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలోని హామీలు, వాటి అమల్లో వైఫల్యాలపై ఛార్జిషీటు జారీ చేసి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను తెలంగాణ నేతలు వివరించారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, టీడీపీల పరిస్థితి గురించి అమిత్‌షా ప్రత్యేకంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రగతి నివేదన సభ గురించి పార్టీ నేతలు వివరించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెట్టిన జోనల్‌ తదితర ప్రతిపాదనలకు కేంద్రం ఆగమేఘాల మీద ఆమోదం తెలపడంతో రెండు పార్టీలు లోపాయికారీ మిత్రులనే తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని కొందరు నేతలు చెప్పారు. ప్రభుత్వాలు సహకరించుకోవడంలో తప్పులేదని ఆయన బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా అది తెలంగాణ ప్రయోజనాల కోసమే గానీ టీఆర్‌ఎస్‌ కోసం కాదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Related posts

`యూట‌ర్న్‌` సాంగ్‌లో అద‌రగొట్టిన స‌మంత‌!

jithu j

ముందస్తు ఎన్నికలు అంటే ఇంత ముందా…ఎన్నికల కమిషన్ సిద్ధం…

chandra sekkhar

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు తుది విచారణ వాయిదా

vimala t

Leave a Comment