telugu navyamedia
క్రీడలు వార్తలు

ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడానికి చాలా కష్టపడ్డాము : కోహ్లీ

ఐపీఎల్ 2020లో ప్లే ఆఫ్స్ అర్హత సాధించడానికి తాము కష్టపడ్డామని, మంచి క్రికెట్ ఆడామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 6 వికెట్లతో ఓడినా.. మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కావడం సంతోషంగా ఉందన్నాడు. ఇదే దూకుడును తదుపరి మ్యాచ్‌ల్లో కనబర్చి తమకు కావాల్సిన ఫలితాన్ని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. ‘ఇది మిశ్రమ ఫలితం. టాస్ సమయంలోనే గట్టిగా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని చెప్పా. 11 ఓవర్‌లో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కావాలంటే 17.3 వరకు తీసుకెళ్లాలని మేనేజ్‌మెంట్ సూచించింది. మా నుంచి ఢిల్లీ మ్యాచ్‌ను లాగేసుకున్నారు. అయినా మేం పోరాడం. మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి కట్టడి చేశాం. ఆఖరి ఓవర్ల వరకు తీసుకెళ్లాం. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కావడం సంతోషంగా ఉంది. టాప్-2లో ఉండటం ఏ జట్టుకైనా మంచిది. అయినప్పటికీ మేం మంచి క్రికెట్ ఆడి టోర్నీలో ముందడుగు వేసాం. మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఫైనల్‌కు చేరుతాం. ఇది మాకు మంచి అవకాశం. మా ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో దూకుడు కనబర్చాం. బంతితో కూడా బాగానే రాణించాం. ముఖ్యంగా పవర్‌ప్లేలో బలంగా మారం. ఇవన్నీ తదుపరి మ్యాచ్‌ల్లో అమలు చేస్తే మాకు కావాల్సిన ఫలితం వస్తుంది. అయితే సానుకూలంగా ఉండటం చాలా ముఖ్యం. ఇక మోర్రిస్, సైనీ తదుపరి మ్యాచ్‌లకు ఫిట్ అవుతారని ఆశిస్తున్నా. ‘అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Related posts