telugu navyamedia
రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం.. ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు!

co-oprative bank

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సహకార బ్యాంకుల విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకొంది. భారత్‌లోని అన్ని సహకార బ్యాంకులను ఆర్‌బీఐ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. భారత్‌లో 1,482 అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులతో పాటు 58 మల్టీ స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకులు ఉన్నాయి. ఇకపై ఇవన్నీ ఆర్‌బీఐ పరిధిలోకి రానున్నాయి.

ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఓ ప్రకటన చేశారు. దేశంలో అర్బన్‌ బ్యాంకుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. కాగా, దేశంలో పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రియ కూడా మరింత సులభతరం కానుందని ఆయన తెలిపారు. ధ్రువీకరణ పత్రాల జాబితాను కేంద్ర ప్రభుత్వం కుదించినట్టు వివరించారు.

Related posts