telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపేసిన ఆర్టీఐ

RBI Currency Notes

ఇకపై రెండు వేల నోట్ల సంఖ్య మరింత తగ్గనుంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక్క 2 వేల రూపాయల నోటును కూడా ముద్రించ లేదు. ఈ విషయాన్ని ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ పెట్టుకున్న దరఖాస్తుకు సమాధానంగా స్వయంగా ఆర్బీఐ తెలియజేసింది.

నాలుగు సంవత్సరాల క్రితం రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసి, ఆపై రూ. 2000 నోటును కేంద్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆపై 2016-17 ఆర్ధిక సంవత్సరంలో రూ. 354.29 కోట్లు, 2017-18లో రూ. 11.15 కోట్లు, 2018-19లో రూ. 4.66 కోట్ల విలువైన 2 వేల నోట్లను ముద్రించిన ఆర్బీఐ గత సంవత్సరం మాత్రం ఎటువంటి ముద్రణా కార్యకలాపాలు చేపట్టలేదు. రూ. 500 నోట్ల ముద్రణ మాత్రం గణనీయంగా పెరిగింది.

2016-17లో ముద్రితమైన రూ. 429.22 కోట్ల విలువైన 500 నోట్లతో పోలిస్తే, గత సంవత్సరం దాదాపు రెట్టింపుగా రూ. 822.77 కోట్ల విలువైన ముద్రణ జరిగిందని ఆర్బీఐ పేర్కొంది. మొత్తం మీద ఈ నాలుగేళ్లలో రూ. 2,458.57 కోట్ల విలువైన రూ. 500 నోట్లు, రూ. 370.10 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ ముద్రించింది.

Related posts