telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

‘కే’ పిచ్చి లో … మాస్ మహారాజా క్రాక్..

raviteja with full mass look again in crack movie

రవితేజ, శృతిహాసన్ ముఖ్య పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం క్రాక్. గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను విడుదల చేశారు. శృతిహాసన్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైకును నడిపిస్తుండగా..పల్లెటూరు గెటప్ లో ఉన్న రవితేజ చేతిలో టిఫిన్ క్యాన్ పట్టుకుని బైకు వెనకాల కూర్చున్న పోస్టర్ సరికొత్తగా ఉంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్. రవితేజ, శృతి హాసన్, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన బలుపు చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన క్రాక్ చిత్ర ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. రవితేజ మరోసారి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా అలరించనున్నట్టు తెలుస్తుంది.

Related posts