telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మొదలైన రవితేజ కొత్త సినిమా!

ఈ ఏడాది సంకరంతికి మాస్ మహారాజ్ రవితేజ సినిమా క్రాక్ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. అయితే ప్రస్తుతం రవితేజ చేస్తున్నసినిమా ఖిలాడి. ఈ సినిమా సురేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది. ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల శివరాత్రి సందర్భంగా విడుదలైన పోస్టర్ ఆ తర్వాత రవితేజ పుట్టినరోజు కానుకగా వచ్చిన గ్లింప్స్ తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే మే 28న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే రవితేజా – త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా మొదలు కాబోతోందనే ప్రకటన వెలువడింది. అయితే… ఇప్పుడు హఠాత్తుగా మరో సినిమా తెరపైకి వచ్చింది. శరత్ మండవ దర్శకత్వలో సుధాకర్ చెరుకూరి… రవితేజతో ఓ సినిమాను ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. వెంకటేశ్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు శరత్ గతంలో రచయితగా పనిచేశారు. ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా, ఓ యూనిక్ థ్రిల్లర్ మూవీని ఆయన తెరకెక్కించబోతున్నారు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. మంగళవారం సంస్థ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమం అనంతరం దేవుని పటాలపై చిత్రీకరించిన మహుర్తపు సన్నివేశానికి రవితేజ క్లాప్ కొట్టగా, మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన రవిశంకర్ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. చిత్ర నిర్మాత సుధాకర్ స్క్రిప్ట్ ను దర్శకుడు శరత్ మండవకు అందించారు. ఇదే నెలలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతోంది.

Related posts