telugu navyamedia
news telugu cinema news trending

డిస్కో రాజా లో .. పాటపాడేసిన మాస్ మహారాజా..

raviteja as singer for disco raja movie

రవితేజ ‘కాలం ఆగాలి.. నా కాలి వేగం చూసి.. లోకం సాగాలి.. నా వేలి సైగే తెలిసి..’ అని సాగిపోయే పాటను తన చిత్రం కోసం పాడారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేశ్‌, తాన్య హోప్‌ కథానాయికలు. వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వం వహించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ చిత్రంలోని ‘రమ్‌ పమ్‌ బమ్‌’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ పాటకు తమన్‌ స్వరాలు సమకూర్చగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. రవితేజ, బప్పిలహరి ఆలపించారు. తొలిసారి ‘బలుపు’ చిత్రం కోసం పాట పాడిన రవితేజ ఆ తర్వాత ‘పవర్‌’, ‘రాజా ది గ్రేట్‌’ చిత్రాల్లోనూ తన గొంతు వినిపించారు. ఆ పాటలన్నీ అలరించాయి. ఇప్పుడు మళ్లీ తమన్‌ సంగీత సారథ్యంలోనే ఈ పాటను పాడటం విశేషం. మరి ఈ పాట ఎంత ట్రెండ్‌ అవుతుందో చూడాలి. అన్నట్లు హాస్య నటుడు సునీల్‌ ఇందులో ఒక డిఫరెంట్‌ గెటప్‌లో కనిపించారు. కావాలంటే మీరూ పాట చూసేయండి.

Related posts

ఏపీలో .. రీపోలింగ్..

vimala p

మినిమమ్ బాలన్స్ లేవని అకౌంట్ క్లోజ్ చేశారు : విజయ్ దేవరకొండ

vimala p

సాయి పల్లవి “అనుకోని అతిథి” సెన్సార్ పూర్తి

vimala p