telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

రోజుకు రెండు మూడు సిమ్ కార్డులు మార్చిన రవిప్రకాశ్?

Ravi Prakash

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ పై డేటా చోరీ, ఫోర్జరీ కేసు నమోదైన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా వ్య్వాహరించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ టీవీ9 కార్యాలయంలో సోదాలు జరిగిన ఈ నెల 9వ తేదీ నుంచి ఇంతవరకూ ఆయన రోజుకు రెండు నుంచి మూడు సిమ్ లను మారుస్తూ వచ్చారని, పోలీసులు అంటున్నారు. సాంకేతికంగా తన జాడను బయట పెట్టకుండా ఉండేందుకు వైఫై ద్వారా వాట్స్ యాప్ కాల్స్ లో మాత్రమే ఆయన మాట్లాడుతున్నారని కూడా గుర్తించినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి.

ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ సైతం ఇంతవరకూ పోలీసులకు లొంగిపోకపోవడంతో వీరిద్దరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తనపై దాఖలైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ను ఇవ్వాలని రవిప్రకాశ్ హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. తాను పోలీసుల విచారణకు సహకరిస్తానని, అయితే, తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరుతున్న విషయం విధితమే.

Related posts