telugu navyamedia
crime news political Telangana

ఆ కథనం ప్రసారం చేసినందుకే.. ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది

Ravi Prakash

 టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కు పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 కింద నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. ప్రస్తుతం రవిప్రకాశ్ పరారీలో ఉన్నారు. అయితే ఓ వెబ్ సైట్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విషయాలను ఆయన వెల్లడించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలను ప్రశ్నిస్తూ ఓ కథనాన్ని ప్రసారం చేశానని ఆయన తెలిపారు. ఆ కథనం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదని, అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.

తనను టార్గెట్ చేయడం వెనుక ఒక స్పష్టమైన రాజకీయ, వ్యాపార అజెండా ఉందని రవిప్రకాశ్ తెలిపారు. వాస్తవానికి ఆ లైవ్ షోను ప్రసారం చేసే సమయంలో కూడా తాను ప్రభుత్వం గురించి ప్రస్తావించలేదని, కేవలం వ్యవస్థ వైఫల్యం గురించే ప్రశ్నించానని చెప్పారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే తామంతా చూసీచూడనట్టు వ్యవహరించాలా? అని రవిప్రకాశ్ ప్రశ్నించారు.

Related posts

అప్పుడే బంగారు తెలంగాణ కల సాకారం: విజయశాంతి

vimala p

రాహుల్ ను .. వారిస్తున్న స్టాలిన్.. రాజీనామా వద్దు..

vimala p

ఒడిశా : ఒకరోజు ముందే.. నవీన్ పట్నాయక్ .. ప్రమాణస్వీకారం ..

vimala p