telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసక్తికరంగా “ఆవిరి” టీజర్

Aaviri

విభిన్న క‌థా చిత్రాల‌ని తెర‌కెక్కిస్తూ మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా, ఉత్తమ టెక్నీషియన్‌గా రవిబాబు గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల రవిబాబు పందిపిల్ల ప్ర‌ధాన పాత్ర‌లో “అదుగో” అనే సినిమాని రూపొందించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా “ఆవిరి” అంటూ మరో విభిన్న ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో ర‌విబాబు, నేహా చౌహ‌న్, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్, ముక్త‌ర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఫ్లైయింగ్ ప్రాగ్స్ చిత్రాన్ని నిర్మిస్తుంది. స‌క్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు త‌న సొంత బేన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్ మీదుగా చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇటీవల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయగా… దానికి మంచి స్పందన వచ్చింది. స్ట‌వ్‌పై ఉన్న కుక్క‌ర్ మ‌ధ్య‌లో నుండి నేహా చూస్తున్న‌ట్టుగా ఫ‌స్ట్ లుక్ డిజైన్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ఆసక్తికరంగా హార్రర్ కథా నేపథ్యంలో తెరకెక్కింది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts